close

తాజా వార్తలు

రోగనిరోధకశక్తిని పెంచుదాం

రోగనిరోధకశక్తి పెరగాలంటే... అన్నిరకాల పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవాలి. అప్పుడే కాలానుగుణంగా వచ్చే అనారోగ్యాలకూ అడ్డుకట్ట వేయొచ్చు.

* ఆకుకూరలు, ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయల్లో బీటాకెరొటిన్‌ ఉంటుంది. ఇది ఎ విటమిన్‌ని అందిస్తుంది. రోజు ఓ కప్పు ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన మాంసకృత్తులతో పాటు ఎ విటమిన్‌ లభిస్తుంది. ఇది పరోక్షంగా రోగనిరోధకశక్తినీ పెంచుతుంది.
* నిమ్మ జాతి పండ్లు, పసుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల నుంచి సి విటమిన్‌ లభిస్తుంది. ఇది లోపిస్తే జలుబు, ప్లూ వంటి అనారోగ్యాలు వస్తాయి. కాలానుగుణంగా లభించే పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే ఇలాంటి వ్యాధులను నిరోధించవచ్చు.
* నూనెగింజల ద్వారా అందే ఖనిజాల్లో జింక్‌ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీడిపప్పు, బాదం, వేరసెనగ, ఆవాలు, నువ్వులు వంటి వాటి నుంచి ఇది సమృద్ధిగా లభిస్తుంది. వీటితో చేసిన ఆహార పదర్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యుల సూచన.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.