close

తాజా వార్తలు

ఖరీదైనవే తినక్కర్లేదు...

ఆరోగ్యంగా ఉండాలంటే... ఖరీదైన పండ్లు, పదార్థాలు తినాలనుకుంటారు కొందరు. ఆ అవసరం లేదు. మనకు నిత్యం అందుబాటులో ఉండే వాటిని, కాలానుగుణంగా దొరికే పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు. డార్క్‌ చాక్లెట్‌, క్వినోవా, ఆలివ్‌ నూనె వంటి వాటిలో ఉండే పోషకాలు ఇతర పదార్థాల్లోనూ దొరుకుతాయి. వీటిద్వారా శరీరానికి అందే ఫ్లవనాయిడ్లు వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఇంతకీ అవేంటంటే...
* గుండె జబ్బులు, కడుపులో మంట, క్యాన్సర్లను నిరోధించే గుణాలున్న ఫ్లవనాయిడ్లు యాపిల్‌లోనూ దొరుకుతాయి. కాఫీ, టీ, జామ, మెంతులు, ఆవాలు, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, పసుపు వంటి వాటిల్లోనూ ఇవి అధికమొత్తంలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తరచూ తీసుకుంటే  గుండె, మెదడుకు సంబంధించిన అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు.
* రోజూ ఓ యాపిల్‌, ఓ నారింజ పండు, వంద గ్రాముల పప్పు ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకుంటే శరీరానికి 500 మిల్లీగ్రాముల ఫ్లవనాయిడ్లు అందుతాయి. ఉసిరి, వాము, జీలకర్ర, యాలకులు... వంటివాటిల్లోనూ క్యాన్సర్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిరోధించే ఫ్లవనాయిడ్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
* తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకం శరీరానికి అందుతుంది. మాంసాహారం తగ్గిస్తూ సమతులాహారం తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫ్లవనాయిడ్లూ అందుతాయి. ఎసిడిటీ కారణంగా వచ్చే మంటను తగ్గించడంతో పాటు వయసుతో వచ్చే అనారోగ్యాలను దూరం చేసేందుకు తోడ్పడతాయివి.
* మెదడు, ఇతర శరీర భాగాలు  ప్రాణ వాయువును గ్రహించేందుకు ఫ్లవనాయిడ్లు ఉపయోగపడతాయి. మతిమరుపు, కుంగుబాటు, మూడ్‌ స్వింగ్స్‌ వంటివి దరిచేరవు.
* ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయడంతో పాటు, అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు  మెదడులో రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. తెల్లరక్తకణాల వృద్ధినీ  పెంచుతాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.