close

తాజా వార్తలు

పంటినొప్పికి బొప్పాయి

బొప్పాయి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అందంతోపాటు, ఆరోగ్యమూ సొంతమవుతుంది. దీన్ని కేవలం పండుగానే కాకుండా స్మూథీ, సలాడ్‌, పరాఠా, హల్వా... ఇలా పలు పదార్థాల తయారీలో వాడొచ్చు.

* ఈ పండులో ఉండే సహజ పీచు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచి... అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు దాడి చేయకుండా చూస్తుంది.
* బొప్పాయిలో పీచు ఎక్కువ. కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. రోజూ తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉన్నా అదుపులోకి వస్తుంది. దీన్నుంచి అందే కెలొరీలూ తక్కువే. ఈ పండు రోజూ తింటే కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గుతాయంటారు నిపుణులు.
* దీంట్లో ఉండే పీచు, విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా అడ్డుకుంటాయి.
* మధుమేహం ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇందులో చక్కెరశాతం తక్కువగా ఉండటమే కారణం.
* బొప్పాయి పండు పంటి నొప్పినీ తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల బారిన పడకుండా కాపాడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. బొప్పాయిలోని పోషకాలు క్యాన్సర్‌ కణాలను నిరోధిస్తాయి.
* ఈ పండు నుంచి విటమిన్‌ ఎ ఎక్కువ మోతాదులో అందుతుంది. దీన్ని తరచూ తీసుకుంటే కంటి సమస్యలు ఎదురుకావు. దీన్ని తినడం వల్ల ఒత్తిడీ అదుపులో ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు.
* ఇందులోని సి, ఈ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు.. వార్థక్యపు ఛాయల్ని నియంత్రిస్తాయి. గర్భిణులు దీన్ని తినకూడదంటారు వైద్యులు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.