close

తాజా వార్తలు

అలంకరణ నిలవాలంటే...

ఉద్యోగినులే కాదు... కాలేజీ అమ్మాయిలు కూడా కాస్తయినా మేకప్‌ లేకుండా బయటకు అడుగు పెట్టడంలేదు. ప్రత్యేక సందర్భాలయితే... అలంకరణ అవసరం కూడా పెరుగుతుంది. మరి ఆ అలంకరణ ఎక్కువసేపు నిలిచి ఉండాలంటే... ఏం చేయాలో చూద్దాం.

*అలంకరణలో కీలకంగా ఉండే ఫౌండేషన్‌, ఐషాడో వంటివి ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే ముందుగా నాణ్యమైన ప్రైమర్‌ని ఎంచుకోవాలి. ఆ తరువాతే మిగిలిన అలంకరణ మొదలు పెట్టాలి. రోజంతా మేకప్‌తో ఉండాల్సి వచ్చినప్పుడు అది చెరిగితే మళ్లీ మొదట్నుంచి వేయాలని లేదు. కాస్తంత టోనర్‌ని ముఖంపై చల్లుకుని, టిష్యూతో అద్ది, ఆపై కొద్దిగా లూజ్‌ పౌడర్‌ని రాసుకుంటే చాలు. మళ్లీ తాజాగా కనిపించొచ్చు.
* పెదవులపై లిప్‌స్టిక్‌నో, లిప్‌గ్లాస్‌నో రాసుకుంటే సరిపోదు. ముందుగా పెదవులని పంచదారతో రుద్దుకోవాలి. దానివల్ల మృతకణాలు తొలగిపోతాయి. అప్పుడు లిప్‌స్టిక్‌ వేసుకుంటే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
* వాతావరణం కాస్త వేడిగా, చెమటలు కారిపోతున్నప్పుడు పదేపదే మేకప్‌ని దిద్దుకోవాల్సిన పనిలేదు. బ్లాటింగ్‌ కాగితంతో అద్దుకుని బయటకు వెళ్లే ముందు ఓ సారి పౌడర్‌ అద్దుకోవాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.