close

తాజా వార్తలు

సులువుగా మార్చేద్దాం

సౌందర్య ఉత్పత్తులు కొన్నిరోజులు వాడాక పొడిబారడం, విరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాగని పారేయాల్సిన అవసరంలేదు. ఇలా చేసి చూడండి. 

సులువుగా మార్చేద్దాం


లిప్‌స్టిక్‌:  ఇది కొన్నిసార్లు తేమ కోల్పోయి గట్టిగా అయిపోతుంది. రంగు మారిపోతుంది. అలాంటప్పుడు దీన్ని కొద్దిగా వేడిచేసి, అరగంట ఫ్రిజ్‌లో ఉంచితే చాలు. మృదువుగా మారడంతో పాటు మంచి రంగూ కనిపిస్తుంది. 
ఐలైనర్‌- మస్కారా: సీసా నిండా మస్కారా ఉన్నా అది కొన్నిసార్లు వాడటానికి పనికిరాదు. కారణం పొడిబారిపోవడమే. ఇలాంటప్పుడు ఒక చుక్క బాదం నూనెను వేసి బాగా కలపాలి. ఆ తరవాత వాడుకోవచ్చు. 
గోళ్లరంగు:  ఇది ఎండిపోయినప్పుడు... మూడు నాలుగు చుక్కలు నెయిల్‌పాలిష్‌ రిమూవర్‌ కలిపి చూడండి. సులువుగా వేసుకోవచ్చు. 
కాంపాక్ట్‌ పౌడర్‌: సగం వాడాక ఎండిపోయి విరిగిపోయినట్లు అవుతుంది. ఇలాంటప్పుడు దానికి కొద్దిగా రబ్బింగ్‌ ఆల్కహాల్‌ కలిపితే చాలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.