close

తాజా వార్తలు

రాత్రివేళ మహిళలకు ఉచిత ప్రయాణం

చండీగఢ్‌: మహిళలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు పంజాబ్‌లోని లుథియానా పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాత్రివేళ ప్రయాణానికి ఇబ్బందిపడే మహిళలకు పోలీసులే తమ సొంత వాహనాల్లో గమ్యస్థానానికి చేర్చనున్నారు. ఇందుకోసం 1091, 78370 18555 హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. ఆ నంబర్లకు ఫోన్‌ చేస్తే పోలీసులు తమ వాహనాల్లో ఉచితంగా గమ్యస్థానానికి చేరుస్తారని నగర పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ అగర్వాల్‌ మీడియాకు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏడాది పొడవునా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. హైదరాబాద్‌లో యువ వైద్యురాలి హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ లుథియానా పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.