close

తాజా వార్తలు

కష్టాలు విన్నాడు.. కన్నీళ్లు తుడిచాడు

చండీగఢ్‌ : పోలీసులంటే కఠినంగా ఉంటారని, మొరటుగా వ్యవహరిస్తారనే అపవాదు ప్రజల్లో ఉంది. అలాంటి అభిప్రాయాన్ని తొలగించేలా పంజాబ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ బాధితురాలి పట్ల ప్రదర్శించిన ఔదార్యం నెటిజన్ల అభిమానాన్ని చూరగొంటోంది. ‘అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇది. రక్షకుడా నీకు సెల్యూట్‌’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌(ఐపీఎఫ్‌) ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘మలేసియా పోలీసులు తన కుమారుడిని అరెస్టు చేశారని భావోద్వేగంతో విలపిస్తున్న వృద్ధురాలి పట్ల ఆ కానిస్టేబుల్‌ విజ్ఞతతో లోతైన సున్నితత్వం, సానుభూతిని ప్రదర్శించాడు’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. ఈ అసలైన రోల్‌మోడల్‌ కానిస్టేబుల్‌ ఆమె కష్టాలన్నీ విని కన్నీళ్లు తుడిచి భరోసా ఇచ్చాడని ఐపీఎఫ్‌ పేర్కొంది. 

56సెకన్ల నిడివిగల వీడియోలో వృద్ధురాలు విలపిస్తూ తన కుమారుడు అరెస్టైన విషయాన్ని ఆ పోలీసుకు వివరించింది. ఆ సమయంలో కానిస్టేబుల్‌ ఆమె పట్ల ప్రవర్తించిన తీరును అభినందిస్తూ ‘బ్రహ్మాండమైన జాలిగుణం. ప్రతి పోలీసూ, ప్రభుత్వ ఉద్యోగి ఈ గుణం అలవర్చుకోవాలని’ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘ప్రజలకు సంబంధించిన సున్నిత విషయాల పట్ల ఈ విధంగా స్పందించే పోలీసులు ఆ శాఖకు అవసరం’ అని మరో నెటిజన్‌ ప్రశంసించాడు. ‘ఓదార్చడానికి ఆమెను దగ్గరకు తీసుకున్న తీరు మనసుకు హత్తుకుంది’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.