close

తాజా వార్తలు

గట్టెక్కాలంటే ఛార్జీలు 70% పెంచాల్సిందే!

వొడాఫోన్‌ ఐడియాపై యాక్సిస్‌ క్యాపిటల్‌

దిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు స్థిరంగా సాగాలంటే, ఛార్జీ(టారిఫ్‌)లను 70% వరకు పెంచాల్సి రావచ్చని యాక్సిస్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం వినియోగదారులపై వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) రూ.107 ఉండగా, ఇది రూ.180కి చేరితే బాలెన్స్‌షీట్‌పై ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. ఇందుకోసం ఛార్జీలు గణనీయంగా పెంచాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపు 12-24 నెలల వ్యవధిలో జరగొచ్చని అంచనా వేసింది. ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం పెరిగితే, నిర్వహణ లాభం ఏడాదికి రూ.21300 కోట్లకు చేరొచ్చని తెలిపింది. డిసెంబరు 1 నుంచి టారిఫ్‌లు పెంచుతామని ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. అయితే ఎంతమేర పెంచబోతోందీ ఇంకా వెల్లడించలేదు.
నీ వినియోగదారులపై సగటు ఆదాయం 10% పెరిగితే, పరిశ్రమలోని కంపెనీలకు రాబోయే మూడేళ్లలో రూ.33,000 కోట్ల అదనపు ప్రతిఫలం లభిస్తుందన్నది టెలికాం విభాగం అంచనా.
నీ టారిఫ్‌లు 70% వరకు పెరిగితే పరిశ్రమకు రాబోయే మూడేళ్లలో రూ.2 లక్షల కోట్ల అదనపు ప్రతిఫలం లభిస్తుందని యాక్సిస్‌ క్యాపిటల్‌ వివరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.