
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: యూజర్స్‌కు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వ్యక్తిగత భద్రత కోసం ఇటీవల తీసుకొచ్చిన ఫింగర్ ప్రింట్ ఫీచర్ ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ఫీచర్ కారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా తగ్గిపోతోందని పలువురు యూజర్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య శాంసంగ్, వన్‌ప్లన్, షావోమి ఫోన్లలో ఎక్కువగా ఉందని తెలిపారు. వాట్పాప్ కొత్త అప్డేట్ కారణంగా 33-40 శాతం బ్యాటరీ తొందరగా డ్రై అవుతోందని యూజర్లు వాపోతున్నారు.
ఆండ్రాయిడ్ 9, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తున్న వన్‌ప్లస్ ఫోన్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్10, గెలాక్సీ నోట్ 10 సిరీస్ ఫోన్లను ఉపయోగించే వారు కూడా ఈ తరహా సమస్యను ఎదుర్కొంటున్నట్లు వారు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గూగుల్ పిక్సెల్, షావోమి ఫోన్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ 2.19.308 వెర్షన్లో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.
తమ ఫోన్లలో బ్యాటరీ సమస్య అధికంగా ఉన్నవారు వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి ప్లే స్టోర్ నుంచి కొత్తగా వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కొంత మంది యూజర్స్ సామాజిక మాధ్యమాల్లో సూచిస్తున్నారు. అయినప్పటికి బ్యాటరీ ఛార్జింగ్ తగ్గుతున్నట్లయితే బీటా వెర్షన్‌ని డౌన్‌చేసుకోవాలని మరికొందరు యూజర్స్ అభిప్రాయపడుతున్నారు. కాని సాధారణ వెర్షన్ కంటే బీటా వెర్షన్లో భద్రత తక్కువ. అయినప్పటికీ వాట్సాప్ దీనికి పరిష్కారం కనుగొనేంత వరకు బీటా వెర్షన్‌ని ఉపయోగించవచ్చు. ఫోన్లో బ్యాటరీ సేవ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అది బ్యాగ్రౌండ్ యాక్టివిటీని తగ్గిస్తుంది. అలా కొంతమేర బ్యాటరీ ఛార్జింగ్‌ను ఆదా చేసుకోవచ్చని పలువురు యూజర్స్ పేర్కొంటున్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
