
తాజా వార్తలు
‘సింగిల్స్‌డే’ మొదటి గంటలో 12 బిలియన్ డాలర్ల వ్యాపారం
షాంఘై: చైనా ఆన్లైన్ వ్యాపార దిగ్గజం ఆలీబాబా హోల్డింగ్స్.. ఈసారి ‘సింగిల్స్‌డే’ షాపింగ్ బొనాంజా సందర్భంగా రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. చైనా కాలమానం ప్రకారం ఈ ఉదయం 8 గంటలకు అమ్మకాలు మొదలయ్యాయి. తొలి గంటలోనే 84 బిలియన్ యువాన్లు(12 బిలియన్ డాలర్లు)కు చేరాయి. గతేడాది 69 బిలియన్ యువాన్లతో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ. అమెరికాలో నిర్వహించే ‘బ్లాక్ ఫ్రైడే’, ‘సైబర్ మండే’ వంటి ఆన్లైన్ షాపింగ్ ఉత్సవాలకు దీటుగా.. ఆలీబాబా ఛైర్మన్ డేనియల్ జాంగ్ 2009 నుంచి ‘సింగిల్స్ డే’ను నిర్వహస్తున్నారు. నవంబర్ 11(11/11)న చైనాలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని ‘డబుల్ ఎలెవెన్’ అని కూడా పిలుచుకుంటారు. ఈ షాపింగ్ ఫెస్టివల్ ఒంటరి పక్షులకు ప్రత్యేకం.
సోలో బతుకే సో బెటరూ... అని పాడుకుంటూ ఒంటరిగా ఉండటమే అనందమని ఈ రోజున పండుగ చేసుకుంటారు. తమకు నచ్చిన వస్తువులను తమకు తామే బహుమతిగా ఇచ్చుకునే ఈ షాపింగ్ ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఈవెంట్‌గా మారింది. కాగా ఆలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా ఈ సెప్టెంబరులో ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన లేకుండా నిర్వహిస్తున్న తొలి సింగిల్స్‌డే ఇది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
