close

తాజా వార్తలు

అయోధ్యలో 16వేల మంది వలంటీర్లు: ఎస్పీ

దిల్లీ: అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు 16వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నవంబర్‌ 17న పదవీ విరమణకు ముందే రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంలో తీర్పు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా వివాదాస్పద పోస్టులు తలెత్తకుండా 1600 ప్రాంతాల్లో వలంటీర్లను నియమించినట్లు ఫైజాబాద్‌ జిల్లా ఎస్పీ ఆశిష్‌ తివారీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఒకటి విఫలమైనా మరొకటి విజయవంతం అయ్యేలా నాలుగంచెల భద్రత ప్రణాళికను సిద్ధం చేశామని వెల్లడించారు. 

‘ప్రజలను సంయమనం చేస్తూ ప్రోత్సహించేందుకు కూడా జిల్లాలోని 16వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేశాం. ఆ వలంటీర్లు ఒకరికొకరు సమాచారాన్ని చేరవేసుకునేలా వారికి పలు వాట్సాప్‌ గ్రూపులను తయారు చేశాం. నాలుగంచెల భద్రతలో భాగంగా రెడ్‌, ఎల్లో, గ్రీన్‌, బ్లూ జోన్లుగా విభజించాం. రెడ్‌, ఎల్లో జోన్లు పారా మిలిటరీ బలగాలు, గ్రీన్‌, బ్లూ జోన్లు సివిల్ పోలీసుల భద్రతలో ఉంటాయి’ అని తెలిపారు. బలగాల వసతి కోసం ఇప్పటికే 700 ప్రభుత్వ పాఠశాలలతో పాటు, 50 యూపీ ప్రాథమిక, 25 సీబీఎస్‌ఈ పాఠశాలలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జిల్లా మేజిస్ట్రేట్‌ అనుజ్‌ కుమార్‌ జా సైతం సామాజిక మాధ్యమాల్లో దేవుళ్ల విగ్రహాలను కించ పరుస్తూ పెట్టే పోస్టులకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ నిషేధాజ్ఞలు డిసెంబర్‌ 28 వరకు ఉంటాయని వెల్లడించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.