
తాజా వార్తలు
ఇస్లాం సందేశం
ప్రకృతిలో, సృష్టి జీవరాశుల నుంచి మనం సేవా దృక్పథాన్ని అలవర్చుకోవచ్ఛు దైవసృష్టిలో ప్రతీదీ అర్థవంతమే. మనం గ్రహించనంత వరకూ వాటి ఉద్దేశం బోధపడదు. ముహమ్మద్ ప్రవక్త (స) బోధనలన్నీ మనిషిలో మానవత్వాన్ని ప్రేరేపించేలా ఉండేవి. చెప్పడమే కాదు.. మిత్రులు, బంధువులు, శత్రువులు అనే తారతమ్యం లేకుండా అందరి అవసరాల్లో ఆదుకునేవారు. ప్రవక్త సహచరులు కూడా పరుల సేవలో తరిస్తుండేవారు. ఒకసారి ఓ నిరుపేద ప్రవక్త (స) దగ్గరికి వచ్చి సాయం అడిగాడు. అతడికి ఇవ్వడానికి ఆ సమయంలో ప్రవక్త దగ్గర ఏమీ లేవు. ‘నువ్వు ఉస్మాన్ దగ్గరికి వెళ్లి నా పేరు చెప్పు! నీకేదైనా సాయం చేస్తాడు’ అన్నారు ప్రవక్త. ఆ వ్యక్తి ఉస్మాన్ ఇంటికి వెళ్లాడు. గుమ్మం దగ్గర నిల్చున్నాడు. ఆ సమయంలో ఉస్మాన్ ‘నువ్వు మందంగా ఉన్న ఒత్తితో దీపం వెలిగించావు. చమురు అంతా వ్యర్థమైపోతోంది’ అని భార్యను మందలిస్తున్నారు. ఈ పిసినారి తనకేం సాయం చేస్తాడనుకుని నిరాశ చెందాడా వ్యక్తి. అక్కడి నుంచి ఇంటికి బయల్దేరాడు. బయటకు వచ్చిన ఉస్మాన్ (రజి) అతడ్ని వెనక్కి పిలిచాడు. ప్రవక్త సాయం చేయమన్నారని బంగారు నాణేల సంచిని ఆ వ్యక్తి చేతిలో ఉంచాడు. ‘దీపంలో చమురు నా సొంత ఇంటి వ్యవహారం. మీకిచ్చిన ఈ బంగారు నాణేలు అల్లాహ్ అనుగ్రహం కోసం ఇచ్చినవి. పైగా నువ్వు ప్రవక్త దగ్గరి నుంచి వచ్చిన వాడివి..’ అన్నారు ఉస్మాన్. ఇంటి ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించే ఉస్మాన్ (రజి) గొప్ప దాత. తన ఇంట్లో రోజూ ఎనభై మందికి పైగా అన్నార్తుల ఆకలి తీర్చేవారు. సేవా భావంతో ఇస్లాం చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఇతరులకు సాయపడటం ఒక లక్షణంగా అలవర్చుకోవాలి. అదే జీవితానికి సాఫల్య మార్గం.
- ఖైరున్నీసాబేగం
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
