close

తాజా వార్తలు

పోలీస్‌గా రానున్న రవితేజ

హైదరాబాద్‌: ‘విక్రమార్కుడు’, ‘పవర్‌’ చిత్రాల్లో పోలీస్‌ పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు మాస్‌ మహారాజ్‌ రవితేజ. తాజాగా ఆయన మరోసారి పోలీస్‌ పాత్రలో సందడి చేయనున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు గోపీచంద్‌. ‘నాకెంతో ఇష్టమైన మాస్‌ మహారాజ్‌ రవితేజతో నా తదుపరి చిత్రం చేయబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో రవితేజ పవుర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. బి.మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే గోపీచంద్‌ మలినేని-రవితేజ కాంబినేషన్‌లో విడుదలైన ‘డాన్‌ శ్రీను’, ‘బలుపు’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 

ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కథానాయికలు. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.