close

తాజా వార్తలు

పండగ వేళ యువత చూపు ఆవైపే!

పుణె: దేశవ్యాప్తంగా 42 శాతానికిపైగా వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్‌ చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రియల్‌టైం ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ అండ్‌ బ్యాంకింగ్‌ సొల్యుషన్స్‌ కల్పన సంస్థ ఏసీఐ వరల్డ్‌వైడ్‌, యూగౌ సంస్థలు సంయుక్తంగా 1,025 మంది వివిధ వయసుల వారిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో అత్యధికంగా క్రెడిట్‌, డెబిట్ కార్డుల ద్వారా చేసే పేమెంట్స్‌ అధికంగా ఉన్నాయి. మరోవైపు 27 శాతం ప్రజలు నగదు రూపంలో చెల్లింపులు జరుపుతున్నట్లు అధ్యనంలో తేలింది.

ప్రధానంగా యువత డిజిటల్ పేమెంట్స్‌ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుందని అధ్యయనంలో తేలింది. వీరిలో నేటి యువత 42 శాతం డిజిటల్ పేమెంట్స్‌ చేస్తే యువత 48 శాతం డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ చేస్తున్న మొత్తం యువతలో 77 శాతం మంది పండగ వేళల్లో ఒక్కసారైనా డిజిటల్‌ చెల్లింపులు చేసినట్లు అధ్యయనంలో వెల్లడైంది. యూపీఐ, ఇతరత్రా వ్యాలెట్ల ద్వారా చేసే డిజిటల్‌ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఏసీఐ వరల్డ్‌ వైడ్‌ సంస్థ దక్షిణాసియా ఉపాధ్యక్షుడు కౌశిక్‌ రాయ్‌ పేర్కొన్నారు.

అధ్యయనంలో వెల్లడైన మరిన్ని విషయాలు..

* పండుగ వేళల్లో 43 శాతం మంది ప్రజలు వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు డిజిటల్ పేమెంట్స్‌ చేస్తున్నారు.
పండుగ సీజన్‌ కొనుగోళ్లకు 32 శాతం మంది అసలు నగదు ఉపయోగించలేదు.
* రూ.1000 కన్నా తక్కువ చెల్లింపులకు 36 శాతం, రూ.1000 కన్నా ఎక్కువ చెల్లింపులకు 37 శాతం మంది పీర్‌ టు పీర్‌ చెల్లింపులు జరిపారు.

డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారికి ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ప్రధానంగా అవసరం. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే సమయంలో ఫెయిల్డ్‌ చెల్లింపులు 36 శాతం, రీఫండ్‌ ప్రాసెసింగ్‌లో సమస్యలు 32 శాతం, చెల్లింపుల సమయంలో జరిగిన ఫ్రాడ్‌ 29 శాతంగా ఉన్నట్లు తేలింది. పేమెంట్స్‌ సంస్థలకు ఇవన్నీ కూడా పెద్ద సవాళ్లుగా నిలిచినట్లు అధ్యయనంలో వెల్లడైంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.