close

తాజా వార్తలు

ఉద్యోగినులకో ప్రణాళిక...

చాలామంది ఉద్యోగినులు తీసుకునే ఆహారంపైనే కాదు, వ్యాయామంపైనా దృష్టిపెట్టరు. అందుకు సమయంలేదనే కారణం చెబుతారు. కానీ దానికో ప్రణాళిక వేసుకుంటే చక్కగా అమలు చేయొచ్ఛు అదెలాగంటే...! ●

అలసటతో విధుల నుంచి తిరిగి వచ్చాక వ్యాయామంపై దృష్టిపెట్టడం కాస్త కష్టమైన విషయమే. అందుకే ఉదయమే అందుకు సరైన వేళగా నిర్ణయించుకోండి. మొదట్లో వర్కవుట్ల కోసం ఓ పావుగంట కేటాయించుకున్నా చాలు...క్రమంగా ఆ టైమ్‌కి అలవాటు పడతారు. ఎందుకంటే...చాలామందికి మొదటి అడుగు వేయడమే అసలు సమస్య మరి.

వ్యాయామం అంటే...జిమ్‌కే వెళ్లక్కర్లేదు. ఆరుబయట ఆటలాడినా సరిపోతుంది. అసలు ఉద్యోగం చేసే వయసులో చిన్నపిల్లల్లా ఆటలేంటి అంటారా? ఇలా చేస్తే సమయం తెలియకుండా శరీరం అలసిపోతుంది. టాక్సిన్లు చెమటరూపంలో బయటికి వెళ్లిపోతాయి. మీకూ తోటివారితో చక్కటి సమన్వయం ఏర్పడుతుంది. అందుకే మళ్లీ మీరు చిన్నపిల్లలైపోండి. ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఆటలు మొదలుపెట్టండి.

ఎప్పుడూ ఒకేతరహా వర్కవుట్లు బోర్‌ కొడతాయి. నడక, పరుగు, యోగ, జుంబా....ఇలా అన్నింటికీ మీ వ్యాయామ ప్రణాళికలో చోటివ్వండి. అన్నీ ఒకేసారి చేయాలనేం లేదు. మీ తీరికని బట్టి దేనికి ఎంత సమయం కేటాయించుకుంటున్నారో రాసి ఓ స్లిప్‌ని గోడకు అతికించండి. అది మీ కళ్లకు కనబడుతుంటే మరింత పట్టుదలగా ముందడుగేస్తారు. వ్యాయామం క్రమం తప్పదు.

వారాంతాల్లో స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లడం సహజమే. ఈ సారి దాన్ని వర్కవుట్‌ పార్టీగా మార్చేయండి. హెల్తీ రెసిపీలు, థీమ్‌ వర్కవుట్లకు ఆ రోజుని కేటాయించుకోండి. అంతా కలిసి చేసుకునే ఈ వేడుక మీకు వ్యాయామం చేయాలనే ఉత్సాహం తెచ్చిపెడుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.