close

తాజా వార్తలు

అపాచీ మరింత స్మార్ట్‌

కారు.. ఆటో.. వాహనం ఏదైనా ఇప్పుడు టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాయి. టీవీఎస్‌ కంపెనీ అందుకు మినహాయింపేమీ కాదు. అపాచీ 200 అప్‌డేటెడ్‌ మోడల్‌ బైక్‌కీ సరికొత్త సొబగులు అద్దింది. ఈ బండి కన్‌సోల్‌కి ‘స్మార్ట్‌ క్సనెక్ట్‌’ అని పేరూ పెట్టేసింది. దీన్ని బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. మిగతా ఫీచర్లు ఏమిటంటే.

విడుదల

* మూల మలుపుల్లోనూ: ఒక్కసారి వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని సెట్‌ చేస్తే చాలు. ప్రతి మలుపునూ కచ్చితంగా చూపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది నావిగేషన్‌.
* ఫోన్‌ అలర్ట్‌లు: ఫోన్‌కి వచ్చే కాల్స్‌ పేర్లతో సహా తెరపై చూపిస్తుంది. ఎస్‌ఎంఎస్‌లూ చూసుకోవచ్చు. వాటిని అటెండ్‌ చేయాలా.. ఆపాలా.. అన్నదీ నిర్ణయించుకోవచ్చు.
* లీన్‌ యాంగిల్‌ మోడ్‌: ఈ బైక్‌లో గైరోస్కోప్‌ సెన్సర్‌ ఉంటుంది. దీని సాయంతో మీరు గతంలో ఎక్కడ ఎంత మొత్తంలో ఒక పక్కకు ఒరిగి బండి నడిపారో చూపిస్తుంది.
* పడిపోయినా అలర్ట్‌: దురదృష్టవశాత్తు బండి మీద నుంచి కింద పడితే మనం ముందు సెట్‌ చేసుకున్న అత్యవసర ఫోన్‌ నెంబర్లకు మూడు నిమిషాల్లోపు రైడర్‌ పడిపోయిన ప్రాంతం వివరాలతో సహా క్రాష్‌ అలర్ట్‌ పంపిస్తుంది.
* ఇంధన హెచ్చరిక: బండిలో పెట్రోల్‌ అయిపోతుంటే హెచ్చరికల సందేశాలు కన్‌సోల్‌లో కనిపిస్తుంటాయి. ఇన్ఫర్మేషన్‌ స్విచ్‌ నొక్కగానే దగ్గర్లోని పెట్రోల్‌బంక్‌కి దారి చూపిస్తుంది.

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.