గౌరీ దిద్దిన అమ్మవారు
close

తాజా వార్తలు

Updated : 09/10/2019 06:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గౌరీ దిద్దిన అమ్మవారు

మైసూరు దసరా ఉత్సవాలు, తిరుపతి బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ యువతి దుర్గ, వరాహలక్ష్మి, శ్రీవారి రూపాల్ని సైకత శిల్పాలుగా మార్చేస్తుంది. ఆమే మైసూరుకు చెందిన ఎం.ఎన్‌. గౌరి. ఇంతకీ ఆమె ఎవరంటే... ‘చిన్నప్పటి నుంచి నాకు కళల పట్ల ఆసక్తి ఎక్కువ. ఇష్టంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరినా మధ్యలోనే చదువు ఆపేశా. ఈ కళలో శిక్షణ పొందా. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా శిల్పాలను రూపొందిస్తున్నా. ముఖ్యంగా దసరా సమయాల్లో అమ్మవారి అవతారాలను ఏటా  మైసూరు, బృందావన్‌ గార్డెన్‌లో వేస్తుంటా. ఇది చాలా కష్టం. ఇందుకోసం మెత్తని ఇసుక ఉండాలి. బొమ్మ వేసినంతసేపు ఇసుక ఆరకుండా చూసుకోవాలి. లేదంటే శిల్పం త్వరగా విడిపోతుంది. ముఖ్యంగా అమ్మవారిని తయారుచేస్తున్నప్పుడు మరింత శ్రద్ధగా ఉంటా. ఒక్కోసారి సైకత శిల్పం తయారుకావడానికి నాలుగైదు రోజులు పడతుంది. ముంబయిలో కిందటేడాది దసరాకు మహిషాసురమర్థినిని ఇసుక శిల్పంగా రూపొందించా. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు ఏటా శ్రీవారి అవతారాలను నేనే రూపొందిస్తా. ఇప్పటి వరకు ఏడుసార్లు ఈ సైకతశిల్పాలను తీర్చిదిద్దా. ఇదంతా ఒకెత్తయితే... దేశంలోనే తొలిసారి సైకతశిల్పాల మ్యూజియం మైసూరులో ఏర్పాటు అయ్యింది. ఇందులో నా భాగœస్వామ్యమూ ఉన్నందుకు ఆనందంగా ఉంది...’ అని చెబుతుంది గౌరి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని