కోడి కూయని ఊరు!
close

తాజా వార్తలు

Published : 07/10/2019 01:09 IST

కోడి కూయని ఊరు!

ఏ పల్లెటూరుకైనా కోడి కూతతో తెల్లవారుతుంది. అసలు కోడే కనిపించని ఊరు ఎక్కడైనా ఉంటుందా..? కోడి కూర తినని పల్లె ఉంటుందా..? ఇక్కడుంది...
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం కంచిరావుపల్లి తండా జనాభా 550. ఈ గ్రామంలో ఎక్కడా కోడి కనిపించదు. కొన్ని తరాల నుంచి ఈ తండా వాసులు కోడి మాంసం, గుడ్లను తినడం లేదు. వారు చేప కూర వాసన కూడా చూడరు. అలాగని ఈ ఊరి వారు శాకాహారులేం కాదు. మేక, పొట్టేలు మాంసం తింటారు. ఈ ఊరు ఇలా ఉండడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. కొన్ని తరాలకు పూర్వం సోమనాథ్‌ బావుజీ అనే గురువు వచ్చి గ్రామంలో పర్యటిస్తుండగా ఆయన వేసిన ఉమ్మిని ఓ కోడి తిందట. అప్పుడాయన ఇక్కడి ప్రజలు కోడి మాంసం, గుడ్లు...కోడికి సంబంధించినవేవీ తినకూడదని ఆజ్ఞాపించారని గ్రామస్థులు చెబుతారు. చేపల నిషేధానికీ ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆ గురువు ఊళ్లో ఉన్న సమయంలోనే పశువులు కాసేవారు చేపలు వండుతుండగా కుండలో ఉన్న చేపలు బతికాయట. దీంతో గురువు వాటిని ముట్టుకోవద్దన్నారని స్థానికులు వివరిస్తారు. ఈ తండా నుంచి పెళ్లి చేసుకుని వెళ్లిన అమ్మాయిలు వారి అత్తవారి ఇళ్లలో వీటిని తినవచ్చు. ఈ ఊరికి వచ్చిన ఆడపడుచులకు మాత్రం పై నిబంధనలు వర్తిస్తాయి.  
- పాతకోటి అంజిరెడ్డి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని