close

తాజా వార్తలు

పోలీసులూ.. ఇంగ్లీష్‌ దినపత్రికలు చదవండి.!

లఖ్‌నవూ: ఇంగ్లీష్‌లో కనీస పరిజ్ఞానం నేర్చుకోండంటూ యూపీలోని బలరాంపూర్‌ జిల్లా పోలీసులకు ఎస్పీ రంజన్‌వర్మ వినూత్న ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలను కూడా వారు తప్పుగా అర్థం చేసుకుంటుండమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని బలరాంపూర్‌ జిల్లా ఎస్పీ రంజన్‌వర్మ గతవారం పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సిబ్బందికి ఇంగ్లీష్‌పై కార్యశాలలు నిర్వహించిన తర్వాత భాషపై కనీస పరిజ్ఞానం నేర్చుకోమని ఆదేశించారు. ఇంగ్లీష్‌ దినపత్రికలు చదవమని సూచించారు. దీంతో పోలీసులందరూ ఇప్పటికే ఇంగ్లీష్‌ పుస్తకాలు డిక్షనరీలతో కుస్తీలు పడుతున్నారు. 

ఐపీఎస్‌ 2011 బ్యాచ్‌కు చెందిన వర్మ గత జూన్‌లో ఈ జిల్లాకు ఎస్పీగా వచ్చారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏమిటని ప్రశ్నించగా.. ‘సైబర్‌ నేరాలకు సంబంధించి సమాచారం గానీ, న్యాయస్థానం తీసుకునే నిర్ణయాలు గానీ ఇంగ్లీష్‌లోనే వస్తాయి. ఇలాంటి వాటిని వారు కనీసం సక్రమంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే భాషలో కనీస పరిజ్ఞానం నేర్చుకోమని సూచించాను. ఇప్పుడిప్పుడే వారు గూగుల్‌ సాయంతో సెలవుల కోసం దరఖాస్తులు పెట్టుకోవడం ప్రారంభించారు. నేను వాటిని పరిశీలించి తప్పులను సరిచేస్తున్నాను’ అని చెప్పారు. ఈ విషయమై సీనియర్‌ అధికారి ఏడీజీ పీవీ రమణశాస్త్రి ప్రశ్నించగా వారు దీనికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. దేవిపటన్‌ డీఐజీ రాకేష్‌సింగ్‌ను ప్రశ్నించగా.. పోలీసు సిబ్బందికి ఇంగ్లీష్‌ తప్పనిసరా, కాదా అనే అంశంపై ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎలాంటి సూచనలు లేవు. సిబ్బందికి ఏ నైపుణ్యాలు అవసరమో పోలీసు నియామక మండలి, డీజీపీ నిర్ణయిస్తారు అని చెప్పారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.