close

తాజా వార్తలు

తీర ప్రాంతాలకు ముప్పు ఉంది: రాజ్‌నాథ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత తీర ప్రాంతానికి ఉగ్రమూకల నుంచి ముప్పు పొంచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దాయాది దేశం భారత్‌లో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు కుట్రపన్నుతోందని పరోక్షంగా పాకిస్థాన్‌ని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ తీరంలో ప్రయాణిస్తున్న ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో ఆయన శనివారం రాత్రి గడిపారు. దేశ రక్షణ కోసం నావికాదళం చేసే పలు కార్యక్రమాలు, సాహస కృత్యాలను ప్రత్యక్షంగా వీక్షించారు. దేశ తీరప్రాంతాన్ని సంరక్షించేందుకు నావికాదళం నిరంతరం కృషి  చేస్తోందని.. ముంబయి తరహా దాడులు భవిష్యత్తులో జరిగే అవకాశం ఏమాత్రం ఉండదని ధీమా వ్యక్తం చేశారు.  

పుల్వామాలో ఉగ్రవాదుల కదలికలు తిరిగి ప్రారంభమయ్యాయని వస్తున్న వార్తలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. ముష్కర మూకలకు ఏ గతి పడుతుందో చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అనంతరం ఆదివారం ఉదయం జలాంతర్గామిపై జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ కృషి కారణంగానే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్
VITEEE 2020
HITS2020
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన