అచ్చుల్లో కమ్మహ!
close

తాజా వార్తలు

Published : 29/09/2019 00:08 IST

అచ్చుల్లో కమ్మహ!

పక్కాలోకల్‌

వియ్యాలవారికిచ్చే కావిడిలో ఆ వంటకం ఉంటే అదో అందం! పలకరించడానికి వెళ్లి ఈ వంటను కానుకగా ఇస్తే... ఇచ్చినోళ్లకి, పుచ్చుకున్నోళ్లకి కూడా ప్రత్యేక గౌరవమే. అయ్య్‌బాబోయ్‌ ఇంతకీ ఏంటా వంటకం అంటారా? ఇంకేంటి మోరి జీడిపప్పు అచ్చేనండి..బాబు!

మోరీ జీడిపప్పు రుచి ఎంత బాగుంటుందో... అక్కడ తయారు చేసే జీడిపప్పు అచ్చుల రుచి కూడా అంతకంటే ప్రత్యేకంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని మోరి గ్రామం అంటే ఎవరికైనా మొదట గుర్తొచ్చేది అక్కడ రుచికరమైన జీడిపప్పులే. ఈమధ్యకాలంలో... జీడిపప్పులు, బెల్లంతో చేసే జీడిపప్పు అచ్చులని కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ తయారైన అచ్చులు, జీడిపప్పు ఉండలకి తెలుగు రాష్ట్రాల్లో భలే గిరాకీ ఉంది. చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలు, కేరళ నుంచి పప్పుని దిగుమతి చేసుకుని అచ్చులని తయారుచేస్తున్నారు. వాటిని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌, భీమవరంతోపాటు... ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

ఈ పాకానికి పాకమే ప్రాణం..
నోట్లో పెట్టుకుంటే చిత్రంగా కరిగిపోయే ఈ జీడిపప్పు అచ్చుల తయారీలో బెల్లంపాకం పట్టడంలోనే అసలు కిటుకంతా ఉందని అంటారు మోరి పాకశాస్త్ర నిపుణులు. కేజీ జీడిపప్పుకి 800గ్రాముల బెల్లంతో ముదర పాకం పడతారు. జీడిపప్పులని దోరగా వేయించి అవి పూర్తిగా చల్లారిన తర్వాతే వాటిని పొగలుకక్కే పాకంలో వేసి కలియతిప్పుతారు. దీనిలోనే నెయ్యి, జీడిపప్పు వేసి అచ్చులుగా పోస్తారు. కొంతమంది ఉండలు కూడా చుట్టించుకుంటారనుకోండి.

పెళ్లిల్లో ప్రత్యేకంగా..
ఆ చుట్టుపక్కల ఊళ్లలో... ప్రముఖుల ఇళ్లల్లో వివాహాలు జరిగితే ఇక్కడ నుంచి జీడిపప్పుల అచ్చులు వెళ్లి పెళ్లి విందులో, పెళ్లి కావిళ్లలో ఒద్దికగా ఒదిగిపోవాల్సిందే. అది చూసి వియ్యాలవారు మురిసిపోవాల్సిందే. పెళ్లిళ్ల సీజన్‌లో రోజుకి 500 కేజీల అచ్చులు ఈజీగా అమ్ముడుపోతాయని అంటున్నారు తయారీదారులు.

- రామకృష్ణ, న్యూస్‌టుడే, మలికిపురం

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని