
తాజా వార్తలు
పోషకాలమ్
ఉల్లిపాయ లేకుండా మనకి రోజు గడవదు. ఉల్లికాడలని ఫ్రైడ్‌రైస్, సలాడ్స్‌లో తప్పించి ఎక్కువగా ఉపయోగించం. అదే వాటి ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇక నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి వంటల్లో వాడేయకపోతే అడగండి....
* ఉల్లికాడలని ఆంగ్లంలో స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. చైనా, జపాన్‌వాసులు సలాడ్స్, సూపుల్లో వీటిని ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా సీఫుడ్‌లో వీటిని వాడితే నీచువాసన ఉండదు కాబట్టి అక్కడ వాటి వినియోగం ఎక్కువ.
* ఉల్లిపాయలతో పోలిస్తే కాడల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తపీడనం అదుపులో ఉంటుంది.
* జలుబు, దగ్గుతో బాధపడేవారు సూప్స్‌లో ఈ కాడలని సన్నగా తరిగి వేసుకుంటే గుణం కనిపిస్తుంది. అలాగే పచ్చికాడల రసం తీసుకుని అంతే పరిమాణంలో తేనెతో కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
* వీటిల్లోని పెక్టిన్ అనే పదార్థం... పెద్దపేగుల్లోని సున్నితమైన పొరలు చెడిపోయి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
* పైల్స్ సమస్యతో బాధపడేవారు పెరుగులో ఉల్లికాడలని వేసి పచ్చిగా తింటే మంచిది. పైల్స్ వల్ల వచ్చే వాపు, నొప్పి తగ్గుతాయి.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
