close

తాజా వార్తలు

థైరాయిడ్‌ తగ్గించే సర్వాంగాసనం

థైరాయిడ్‌కు చికిత్సలు ఉన్నప్పటికీ  యోగా, ధ్యానంతో మంచి ఫలితాలు ఉంటాయి. పిండిపదార్థాలు, కొవ్వులను తగ్గిస్తూ, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు, తాజా పండ్లు, ఆకుకూరలను ఆహారంలో తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతోపాటు కొన్ని ఆసనాలు థైరాయిడ్‌  సమస్యను నివారిస్తాయి. అవేంటంటే...

మర్జారి ఆసనం 

జ్రాసనం వేసి... తరువాత మోకాళ్లపై నిల్చోవాలి. నెమ్మదిగా చేతుల్ని నేలపై ఆనించి... ముందుకు వంగుతూ మోకాళ్లు, మోచేతులపై శరీర బరువు ఉంచాలి. మోకాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును కిందకు వంచుతూ శ్వాస తీసుకుంటూ ముఖాన్ని పైకి లేపాలి. శ్వాస వదులుతూ ముఖాన్ని కిందకు వంచుతూ వెన్నును పైకి లేపాలి. ఈ ఆసనం వేస్తున్నప్పుడు పొట్టపై దృష్టి పెట్టాలి. తరువాత వజ్రాసనంలోకి వచ్చి విరామం తీసుకోవాలి. 

సేతుబంధాసనం

ముందు వెల్లకిలా పడు కోవాలి. మోకాళ్లు మడిచి, చేతులతో మడమల్ని పట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ సాధ్యమైనంత వరకు నడుము భాగాన్ని పైకెత్తి, వంతెన ఆకారం వచ్చేలా చేయాలి. చేతులు భుజాలు నేలపై, మోకాళ్లు, కాళ్లు ఒకే వరుసలో ఉండాలి. కావాలంటే చేతులను నడుముకు దన్నుగా పెట్టుకోవచ్చు. ఇలా ఇరవై సెకన్ల నుంచి నిమిషం వరకూ ఉన్నాక... శ్వాస వదులుతూ విశ్రాంత స్థితిలోకి రావాలి. ఇది మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. నడుము కండరాలు బలోపేతం కావడంతోపాటు జీర్ణక్రియ రేటు మెరుగవుతుంది. కడుపులో పుండ్లు ఉంటే ఈ ఆసనం వేయకూడదు. 

ఉష్ట్రాసనం

జ్రాసనంలో కూర్చొని మోకాళ్లపై లేవాలి. చేతుల్ని నడుముపై ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెన్నెముకను వెనక్కి వంచుతూ తలను వీలైనంత వెనక్కి తీసుకెళ్లాలి. దీన్ని అర్ధ ఉష్ట్రాసనం అంటారు. నిదానంగా శ్వాస వదులుతూ కుడి చేత్తో కుడి కాలి మడమను, ఎడమ చేత్తో ఎడమ కాలి మడమను పట్టుకోవాలి. శ్వాస సాధారణంగా తీసుకుంటూ ఇలా పది నుంచి ముప్పై సెకన్ల వరకు ఉండాలి. శ్వాస వదులుతూ మెడను సాధారణ స్థితికి తీసుకురావాలి. వెన్నును నిటారుగా ఉంచి వజ్రాసనంలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. వెన్ను, మెడ కండరాలను దృఢపరచడమే కాదు, తల, ఛాతీలో రక్తప్రసరణ పెరగడానికి థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వరిబీజం, అధిక రక్తపోటు, పొట్టలో అసౌకర్యంగా ఉన్నవారు, గర్భవతులు దీన్ని వేయకూడదు. 

సర్వాంగాసనం: శవాసనంలో పడుకొని కాళ్లను తొంభై డిగ్రీల కోణంలో పైకి లేపాలి. మోచేతుల్ని నేలపై ఉంచి... అరచేతులతో నడుముభాగాన్ని పట్టుకోవాలి. చుబుకాన్ని కంఠానికి ఆనించే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలో అర నిమిషం నుంచీ నిమిషం వరకూ ఉండొచ్చు. కాళ్లను నిదానంగా కిందకు దింపుతూ యథాస్థానానికి రావాలి. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడటానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, హెర్నియా, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు ఈ ఆసనం వేయకూడదు.

- బోధి ట్రైనింగ్‌ అకాడమి హైదరాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.