close

తాజా వార్తలు

7 పెళ్లిళ్లు.. 20 మందిపై అత్యాచారం!

చెన్నైలో నకిలీ  ఎస్సై అరెస్టు
ఏపీలోనూ నిందితుడిపై పలు కేసులు

చెన్నై, న్యూస్‌టుడే: ఏడుగురు యువతులను పెళ్లిచేసుకుని మోసం చేయడంతోపాటు 20 మంది మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నకిలీ ఎస్సైని అరెస్టు చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. చెన్నై ఎగ్మూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 30న ఆఫీసు నుంచి ఆమె ఇంటికి వెళ్లలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈలోపు యువతి తల్లిదండ్రులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.  యువతి పనిచేస్తున్న కంపెనీ ఎండీ రాజేశ్‌ పృథ్వీ (29) ఆమెను అపహరించి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అతడి సొంత ఊరైన తిరుప్పూరు జిల్లా నొచ్చిపాళైయం వెళ్లిన పోలీసులు.. అక్కడ బందీగా ఉన్న యువతిని రక్షించారు. తర్వాత ఆమెతో మాట్లాడించి పృథ్వీని ఇంటికి పిలిపించిన పోలీసులు.. అతడిని అరెస్టుచేసి విచారణ జరిపారు. రాజేశ్‌ పృథ్వీ ఏడోతరగతి మాత్రమే చదివాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పలుపేర్లతో పెద్ద చదువులు చదివినట్లు నమ్మించి అనేకమంది మహిళలను మోసగించి అత్యాచారం చేసినట్లు తేలిందన్నారు. ఇప్పటికే ఆరుగురు యువతులను పెళ్లి చేసుకున్నాడన్నారు. అతడిపై తమిళనాడులోని తిరుచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, శ్రీకాళహస్తి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో నమోదైన ఓ కేసులో జైలుశిక్ష పడింది. శ్రీకాళహస్తి పోలీసులు కోయంబత్తూరులో అరెస్టు చేసినప్పుడు కస్టడీ నుంచి పారిపోయాడు. ఏడోపెళ్లి చేసుకోవడానికి ఎస్సై అవతారమెత్తాడు. ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి అమైందకరైలో నకిలీ కాల్‌సెంటం్ ప్రారంభించాడు. ఇక్కడ 20 మంది మహిళలను బెదిరించి అత్యాచారం చేశాడు. చివరిగా ఎగ్మూరు యువతిని అపహరించి ఏడో పెళ్లి చేసుకున్నాడు. వైద్య కళాశాలలో సీటు ఇప్పిస్తానని రూ.30 లక్షల మేరకు మోసం చేశాడు. అమైందకరై పోలీసుస్టేషన్ లో ఇతడిపై 15 మంది ఫిర్యాదుచేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.