close

తాజా వార్తలు

Updated : 14/09/2019 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్‌జిల్‌ జిగేలు రాజా..

ఫ్యాషన్‌

మీరో పార్టీకి వెళ్లారనుకోండి... అక్కడ అందరి కళ్లూ మీ టీ షర్టు మీదే ఉండాలి. కొందరు దాన్ని చూసి అవాక్కవ్వాలి. అలాంటి టీ షర్టు వేసుకున్నందుకు మీకు గర్వంగా... పక్కవాళ్లకు అసూయగా ఉండాలి. పార్టీ ఇచ్చే స్నేహితుడూ మీ టీ షర్టును చూసి తెగ కుళ్లుకోవాల్సిందే. ఎందుకంటే... పార్టీ తనదైతే అందరి కళ్లూ మీ మీదే ఉంటాయి. అయినా మీరు వేసుకున్న టీ షర్టులాంటిది ఎవరూ వేసుకోకపోతే ఆ కిక్కే వేరప్పా. అలాంటి కిక్కు మీ సొంతం కావాలంటే మీ దగ్గర ఇలాంటి ‘గ్లో ఇన్‌ డార్క్‌ టీ షర్టులు’ ఉండాల్సిందే. వీటి ప్రత్యేకత ఏమిటంటే... ఈ డిజైన్‌ల మీద చీకట్లో మెరిసే ఫ్లోరోసెంట్‌ పెయింట్‌ను వేస్తారు. దాంతో పగలు సాదాగా కనిపించే ఈ డిజైన్‌ రాత్రిళ్లు మాత్రం మెరుస్తుంది. మీరు కనిపించకుండా డిజైన్‌ మాత్రమే చీకట్లో మెరుస్తూ, కదులుతుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. వీటిలో జంతువుల బొమ్మలు, అస్థిపంజరాలూ ఉన్నాయి. ఇవి వేసుకుని స్నేహితులను ఆశ్చర్యపరుస్తారో... భయపెడతారో అంతా మీ ఇష్టం.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని