close

తాజా వార్తలు

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడని..

లఖ్‌నవూ: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ యువకుడిపై ఇద్దరు పోలీసులు చేయిచేసుకున్నారు. మానవత్వం కోల్పోయి నడిరోడ్డుపైకి ఈడ్చుకెళ్లి చితకబాదారు. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్ధార్థ్‌ నగర్ జిల్లాలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో గురువారం  ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు పోలీసుల ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించావంటూ ద్విచక్ర వాహనాన్ని ఆపారు. ఈ నేపథ్యంలో యువకుడు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో యువకుడిని ఇద్దరు పోలీసులు చితకబాదారు. రోడ్డుపైకి ఈడ్చి కాళ్లతో తంతూ చిత్రహింసలు పెట్టారు. ‘నేను చేసినదానిలో తప్పుంటే నన్ను జైలులో పెట్టండి’ అంటూ అతడు ప్రాథేయపడినా కనికరించలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేయటమే కాకుండా దర్యాప్తునకు ఆదేశించారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.