Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008808
            [news_title_telugu_html] => 

స్టీల్‌ నిబంధనలపై కేంద్రం పునరాలోచించాలి

[news_title_telugu] => స్టీల్‌ నిబంధనలపై కేంద్రం పునరాలోచించాలి [news_title_english] => DGFT Notification to Hurt Steel Imports Engineering Exporters Body Writes to Piyush Goyal [news_short_description] => స్టీల్‌ దిగుమతుల రిజిస్ట్రేషన్‌ నిబంధనపై కేంద్రం పునరాలోచించాలని భారత ఇంజనీరింగ్‌ ఎగుమతుల విభాగం(ఈఈపీసీ) సభ్యులు కేంద్రాన్ని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 215 స్టీల్‌ ఆధారిత ఉత్పత్తులపై ఉక్కు దిగుమతుల పర్యవేక్షణ సంఘం(ఎస్‌ఐఎంఎస్‌) రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి [news_tags_keywords] => steel imorts,eepc,piyush goyel,sims [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 00:07:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్టీల్‌ నిబంధనలపై కేంద్రం పునరాలోచించాలి - DGFT Notification to Hurt Steel Imports Engineering Exporters Body Writes to Piyush Goyal - EENADU
close

తాజా వార్తలు

స్టీల్‌ నిబంధనలపై కేంద్రం పునరాలోచించాలి

దిల్లీ: స్టీల్‌ దిగుమతుల రిజిస్ట్రేషన్‌ నిబంధనపై కేంద్రం పునరాలోచించాలని భారత ఇంజనీరింగ్‌ ఎగుమతుల విభాగం(ఈఈపీసీ) సభ్యులు కేంద్రాన్ని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 215 స్టీల్‌ ఆధారిత ఉత్పత్తులపై ఉక్కు దిగుమతుల పర్యవేక్షణ సంఘం(ఎస్‌ఐఎంఎస్‌) రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని కేంద్రం సెప్టెంబర్‌ 16 నుంచి నిబంధనలు అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనల్లో మార్పులు చేయాలని ఇంజనీరింగ్‌ ఎగుమతుల విభాగం సభ్యులు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాశారు. ‘ఇంజనీరింగ్‌ ఎగుమతులకు స్టీల్‌ ఆధారిత వస్తువులే ముఖ్యమైనవి. ఇప్పుడు కొత్తగా అమలు కానున్న నిబంధనలతో స్టీల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, దేశీయ ఖర్చులు పెరగడంతోనే మేము నానా అవస్థలు పడుతున్నాం. మళ్లీ ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే స్టీల్‌ ధరలు బాగా పెరుగుతాయి కాబట్టి ఇది మాకు ఎంతో ఇబ్బందులకు గురి చేసే అంశం. దీనిపై పునరాలోచించి నిబంధనలో మార్పులు చేయాలని కోరుతున్నాం’ అని ఈఈపీసీ విభాగం సభ్యులు గోయెల్‌కు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. 

విదేశాల నుంచి స్టీల్‌ దిగుమతులపై ఎస్‌ఐఎంఎస్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అంటూ వాణిజ్య, పరిశ్రమల శాఖ డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధన సెప్టెంబర్‌ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ నిబంధన ద్వారా ఎగుమతులు, దిగుమతులను పారదర్శకంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది, అంతేకాకుండా బిల్లింగ్‌ సమస్యలను కూడా నివారించడానికి తోడ్పడుతుందని డీఈఎఫ్‌టీ వెల్లడించింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.