close

తాజా వార్తలు

శిక్షించాడని పైఅధికారిని కాల్చి చంపాడు..

చెన్నై: తన పై అధికారిని ఓ రైఫిల్‌ మెన్‌ కాల్చి చంపిన ఘటన తమిళనాడులోని పల్లవరం బ్యారక్స్‌లో మంగళవారం చోటు చేసుకుంది. రైఫిల్‌ మెన్‌ విధుల్లో అలసత్వం వహిస్తుండంతో ఓ పై అధికారి అతన్ని శిక్షించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న రైఫిల్‌ మెన్‌ ఆ అధికారిని అదును చూసి కాల్చి చంపాడు. అనంతరం భయంతో తనకు తాను  కాల్చుకుని ఆత్మహత్య చేసకున్నాడు. 
ఉదయం 3గంటల సమంయంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ‘విధుల్లో అలసత్వం వహించినందుకు ఓ అధికారి రైఫిల్‌మెన్‌ను శిక్షించాడు.. దీన్ని మనసులో పెట్టుకున్న రైఫిల్‌మెన్‌ ఈ ఘటనలకు పాల్పడినట్లు’ ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.