close

తాజా వార్తలు

సైనిక వాహనం అనుకొని రాళ్లు రువ్వారు

శ్రీనగర్‌: ఓ సాధారణ వాహనాన్ని సైనిక వాహనంగా భావించి కశ్మీర్‌ లోయలో కొంత మంది అల్లరి మూకలు దానిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. పలు చోట్ల ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్న వేళ ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనకు కారణమైన నిందితుల్ని పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. మరో ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అనంత్‌నాగ్ జిల్లా జ్రాదిపొరా ప్రాంతంలో నూర్‌ మహ్మద్‌(42) తన లారీలో సరకుల్ని నింపుకొని వెళ్తున్నాడు. స్థానిక యువకులు దాన్ని భద్రతా బలగాల వాహనానంగా భావించి రాళ్లు రువ్వారు. దీంతో నూర్‌ మహ్మద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడికి చేరుకొన్న భద్రతా సిబ్బంది అల్లరి మూకల్ని చెదరగొట్టారు. నూర్‌ మహ్మద్‌ని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటన వెనక గల కారణాలను ఆరా తీస్తున్నారు. అధికరణ 370 రద్దు తరవాత రాష్ట్రంలో పలు చోట్ల ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా బలగాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.