Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145085
            [news_title_telugu_html] => 

రూ.10వేలలోపు ఆ ఫీచర్‌ ఉన్న తొలి ఫోన్‌ ఇదే!

[news_title_telugu] => రూ.10వేలలోపు ఆ ఫీచర్‌ ఉన్న తొలి ఫోన్‌ ఇదే! [news_title_english] => Realme 5 Pro Realme 5 With Quad Rear Camera Setups Launched in india [news_short_description] => ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ వరుస మొబైల్‌ ఫోన్లతో మార్కెట్‌లో దూసుకుపోతుంది. మంగళవారం మిడ్‌ రేంజ్‌లో రియల్‌ మి మరో రెండు స్మార్ట్‌  ఫోన్లను.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:18:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రూ.10వేలలోపు ఆ ఫీచర్‌ ఉన్న తొలి ఫోన్‌ ఇదే! - Realme 5 Pro Realme 5 With Quad Rear Camera Setups Launched in india - EENADU
close

తాజా వార్తలు

రూ.10వేలలోపు ఆ ఫీచర్‌ ఉన్న తొలి ఫోన్‌ ఇదే!

భారత విపణిలోకి రియల్‌మి 5ప్రో, రియల్‌మి 5 విడుదల

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ వరుస మొబైల్‌ ఫోన్లతో మార్కెట్‌లో దూసుకుపోతుంది. మంగళవారం మిడ్‌ రేంజ్‌లో రియల్‌ మి మరో రెండు స్మార్ట్‌  ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్‌ మి 5ప్రో, రియల్‌మి 5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లు నాలుగు కెమెరాలు కలిగి ఉండటం విశేషం. అంతేకాదు రూ.10వేలలోపు మొబైల్‌ శ్రేణిలో నాలుగు కెమెరాలు ఉన్న ఏకైక ఫోన్‌ రియల్‌ మి5గా రికార్డు సృష్టించింది. 

రియల్‌ 5ప్రో మూడు వేరియంట్లలో లభించనుంది. 4జీబీ ర్యామ్‌ +64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధరను రూ.13,999గా నిర్ణయించగా, 6జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌+128జీబీ అంతర్గత మెమొరీ ఉన్న మొబైళ్ల ధరలను వరుసగా రూ.14,999, రూ.16,999గా నిర్ణయించారు. ఇక రియల్‌మి 5 ప్రారంభ ధర రూ.9,999 కాగా(3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌), 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్‌ 10,999, 4జీబీ ర్యామ్‌ /128జీబీ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధరను రూ.11,999గా నిర్ణయించారు.

సెప్టెంబరు 4వ తేదీ నుంచి ఈ ఫోన్లను ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్‌ మి.కామ్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇక రియల్‌ మి5 ఆగస్టు 27న ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. ఈ సందర్భంగా రియల్‌మి ఐకానిక్‌ కేస్‌(రూ.399-సేల్‌: సెప్టెంబరు 21), రియల్‌మి టోట్‌ బ్యాగ్‌(రూ.1,199, సేల్‌: సెప్టెంబరు 4) రియల్‌మి బడ్స్‌2(రూ.599 సేల్‌: సెప్టెంబరు 4)లను కూడా విడుదల చేసింది. 
రియల్‌మి5 ప్రో ప్రారంభ ఆఫర్‌ కింద జియో వినియోగదారులు రూ.7వేల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. వడ్డీ రహిత వాయిదాలు, ఫ్లిప్‌కార్ట్‌ అందించే పూర్తి మొబైల్ ప్రొటెక్షన్‌, పేటీఎం ఫస్ట్‌ మెంబర్‌ షిప్‌తో పాటు, పేటీఎం యూపీఐ ద్వారా కొనుగోలు చేసే వారు రూ.2వేల వరకూ క్యాష్‌ బ్యాక్‌ను పొందవచ్చు. రియల్‌5పై ఎలాంటి ఆఫర్లను సంస్థ ప్రకటించలేదు.

రియల్‌ 5ప్రో ప్రత్యేకతలు
* 6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
* కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ 3+ ప్రొటెక్షన్‌
* స్నాప్‌డ్రాగన్‌ 712 ప్రాసెసర్‌, 2.3గిగాహెడ్జ్‌ క్లాక్‌ స్పీడ్‌
* వెనుకవైపు 48+8+2+2 మెగాపిక్సెల్స్‌ కలిగిన నాలుగు కెమెరాలు(48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ వైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌, 2ఎంపీ మాక్రో సెన్సార్‌, 2 ఎంపీ పోట్రేట్‌ సెన్సార్‌)
* ముందువైపు 16మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
* 4జీబీ+64జీబీ, 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ ర్యామ్‌, స్టోరేజ్‌ వేరియంట్స్‌
* మెమొరీ కార్డు సాయంతో 256జీబీ వరకూ స్టోరేజ్‌ను పెంచుకునే వెసులుబాటు
* 4,035ఎంఏహెచ్‌ బ్యాటరీ
* టైప్‌-సి పోర్ట్‌, వూక్‌ 3.0 ఫాస్ట్‌ ఛార్జింగ్‌

రియల్‌ మి5 ప్రత్యేకతలు
* 6.5 అంగుళాల హెడ్‌+ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌
* 3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌, 32జీబీ, 64జీబీ, 128జీబీ మెమొరీ ఆప్షన్స్‌
* మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 256జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వెసులుబాటు
* 12+8+2+2 మెగాపిక్సెల్స్‌ కలిగిన నాలుగు కెమెరాలు
* ముందువైపు 13మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
* 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, మైక్రో యూఎస్‌బీ 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.