Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145015
            [news_title_telugu_html] => కరుగుట పెరుగుట కొరకే..!
            [news_title_telugu] => కరుగుట పెరుగుట కొరకే..!
            [news_title_english] => An oversold stock market could be in for a bounce back
            [news_short_description] => దేశీయ మార్కెట్‌ సూచీల్లో ప్రస్తుతం విక్రయాల మూడ్‌ కనబడుతోంది. ముఖ్యంగా ఫారెన్‌ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్‌ మార్కెట్లో విపరీతంగా అమ్మకాలకు 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 11:45:48
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
కరుగుట పెరుగుట కొరకే..! - An oversold stock market could be in for a bounce back - EENADU
close

తాజా వార్తలు

కరుగుట పెరుగుట కొరకే..!

ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీల్లో ప్రస్తుతం విక్రయాల మూడ్‌ కనబడుతోంది. ముఖ్యంగా ఫారెన్‌ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్‌ మార్కెట్లో విపరీతంగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా మార్కెట్లు ఒక్కసారిగా ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితుల్లో తమ పొజిషన్లను కవర్‌ చేయడానికి మళ్లీ కొనుగోళ్లు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది మొదలైతే మార్కెట్లలో మళ్లీ భారీ ర్యాలీలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

లక్ష నిఫ్టీలను అమ్మేశారు..

ఒక్క ఎఫ్‌పీఐలే నికరంగా లక్ష నిఫ్టీ కాంట్రాక్టుల్లో షార్ట్‌(అమ్మకం) పొజిషన్లు తీసుకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చాలా ఎక్కువ. ఎఫ్‌పీఐలు బేరిష్‌గా ఉన్న నెల తర్వాత మార్కెట్లు కనీసం 5 నుంచి 8 శాతం వరకు పెరిగినట్లు గత ఐదు సందర్భాల్లో వెల్లడయ్యాయి. అంటే ఈ సారి కూడా ర్యాలీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఎఫ్‌పీఐలు నిరాశజనకంగా ఉన్నప్పుడు ఈ ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి వెళుతుంటాయి. జులై నుంచి విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎఫ్‌పీఐలు, హెచ్‌ఎన్‌ఐల అదనపు పన్ను విధించాలనే నిర్ణయం కూడా దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. మరోపక్క భారత ఆర్థిక వ్యవస్థ మందగించడంతో వీరి నమ్మకం కూడా దెబ్బతింది. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఎటువంటి ఉద్దీపన చర్యలు చేపట్టకుండా వేచిచూసే ధోరణి అవలంభించడం వారికి మింగుడుపడటంలేదు. 

పెరిగిన పుట్‌-కాల్‌ నిష్పత్తి..
ఆప్షన్స్‌ కూడా మార్కెట్‌ ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో ఉందన్న విషయాన్ని చెబుతున్నాయి. ముఖ్యంగా వాల్యూమ్స్‌ ఆధారంగా ఉండే పుట్‌-కాల్‌ నిష్పత్తి ఎక్కువగానే ఉంది. గత 31రోజుల సగటు చూస్తే 0.66 శాతంగా నమోదైంది. అంటే మార్కెట్లో  కాల్స్‌ కంటే అత్యధికంగా పుట్స్‌నే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడర్లు మార్కెట్‌పై నిరాశంలో ఉంటే పుట్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో నెలకొన్న ఈ ప్రతికూల ఒత్తిడి తగ్గడానికి షార్ట్‌ కవరింగ్‌ రూపంలో ర్యాలీ చోటు చేసుకొంటుంది. 

భారీగా తగ్గిన సూచీలు..

సోమవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 37,402 పాయింట్ల వద్ద ఉంది. జూన్‌4న  నమోదు చేసిన రికార్డు స్థాయి కంటే ఇది 7శాతం తక్కువ. చాలా షేర్లు ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి జారుకొన్నాయని ఈ సూచీలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో మార్కెట్లో సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. ఈ సమయంలో ర్యాలీ జరిగినా అది స్వల్పకాలమే ఉండవచ్చని భావిస్తున్నారు. ర్యాలీ జరిగినా.. సెంటిమెంట్‌ పుంజుకొనే అవకాశాలు ఇప్పటి వరకు లేవని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు పడిపోయిన ప్రతిసారీ ర్యాలీ చూశామని ఐసీఐసీఐ డైరెక్ట్‌ హెడ్‌ అమిత్‌ గుప్తా వెల్లడించారు. 

మార్కెట్‌ ర్యాలీపై ప్రతికూల ప్రభావాలు..

దేశంలో అత్యధిక కార్పొరేట్‌ సంస్థలు నిరాశాజనక ఫలితాలు ప్రకటించడం, అమెరికా ఫెడ్‌ రిజర్వు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోవడం, అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ కొలిక్కి రాకపోవడం వంటివి మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల సీఎల్‌ఎస్‌ఏ నోట్‌ ప్రకారం ఆర్థిక మందగమనం కారణంగా జూన్‌ త్రైమాసికంలో కార్పొరేట్‌ లాభాల్లో కోత పడిందని పేర్కొంది. పరిస్థితులను గమనిస్తుంటే సమీప భవిష్యత్తులో ర్యాలీ ఉన్నా మార్కెట్‌పై ముసురుకొన్న సంక్షోభ నీడలు మాత్రం ఇప్పట్లో తొలగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.