Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144612
            [news_title_telugu_html] => 

సవాళ్లున్నా చైనాలో పెట్టుబడులు పెడతాం..

[news_title_telugu] => సవాళ్లున్నా చైనాలో పెట్టుబడులు పెడతాం.. [news_title_english] => Indian companies plan to invest more in China [news_short_description] => బీజింగ్, వాషింగ్టన్‌ మధ్య జరిగే వాణిజ్య యుద్ధ ప్రభావం చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తమ మీద పడదని భారత కంపెనీలు భావిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. [news_tags_keywords] => Indian companies, China , CII [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:38:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సవాళ్లున్నా చైనాలో పెట్టుబడులు పెడతాం.. - Indian companies plan to invest more in China - EENADU
close

తాజా వార్తలు

సవాళ్లున్నా చైనాలో పెట్టుబడులు పెడతాం..

 

దిల్లీ: బీజింగ్, వాషింగ్టన్‌ మధ్య జరిగే వాణిజ్య యుద్ధ ప్రభావం చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తమ మీద పడదని భారత కంపెనీలు భావిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. పైగా 2019లో ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్న ప్రణాళికతో సదరు కంపెనీలు ముందుకెళ్తున్నట్లు పేర్కొంది. ఈ సర్వేను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించింది. ఆ కంపెనీలు ఆశావాదంతో ముందుకెళ్తున్నప్పటికీ, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలిపింది.

‘గత సంవత్సరం నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలతో పోల్చుకుంటే చైనాలో కార్యకలాపాలు చేపడుతోన్న కంపెనీలు జాగరూకతతో కూడిన ఆశావాదాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. వాణిజ్య యుద్ధ ప్రభావం  వారి వ్యాపారం మీద పడదని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. అక్కడ వ్యాపారం నిర్వహించడానికి పెరుగుతోన్న కార్మికుల వేతనాలు, కఠినమైన నిబంధనలు సవాళ్లుగా ఉన్నప్పటికీ, ప్రపంచ సగటుతో పోల్చుకుంటే ఆవిష్కరణలకు చైనా అనుకూలంగా ఉందని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్ చంద్రజిత్ బెనర్జీ సర్వే వివరాలను వెల్లడించారు. 120కు పైగా భారతీయ కంపెనీలు ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 98 శాతం కంపెనీలు ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాయని, వాటిలో ఐటీ, బీపీఓ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. చైనాలో భారత కంపెనీల పనితీరును అంచనా వేయడమే ఈ సర్వే ఉద్దేశమన్నారు. అలాగే చైనా, భారత్ మధ్య లోతైన ఆర్థిక సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని ఈ సర్వే ద్వారా వెల్లడవుతోందని తెలిపారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.