Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144579
            [news_title_telugu_html] => 

ఈ యాప్స్‌ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉన్నాయా?

[news_title_telugu] => ఈ యాప్స్‌ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉన్నాయా? [news_title_english] => Check this app list and avoid them [news_short_description] => గూగుల్‌ ప్లే స్టోర్‌లో రోజూ కొత్త యాప్స్‌ యాడ్‌ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ కూడా వచ్చి చేరుతుంటాయి. వినియోగదారుల... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 09:33:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈ యాప్స్‌ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉన్నాయా? - Check this app list and avoid them - EENADU
close

తాజా వార్తలు

ఈ యాప్స్‌ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉన్నాయా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ ప్లే స్టోర్‌లో రోజూ కొత్త యాప్స్‌ యాడ్‌ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ కూడా వచ్చి చేరుతుంటాయి. వినియోగదారుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. అందుకే వాటిని సైబర్‌ సెక్యూరిటీ కంపెనీలు, యాంటీ వైరస్‌ సంస్థల హెచ్చరికల మేరకు గూగుల్‌ తొలగిస్తుంటుంది. తాజాగా డాక్టర్‌ వెబ్‌ అనే యాంటీ వైరస్‌ సంస్థ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాదకరమైన యాప్‌లను గుర్తించింది. ఆ యాప్‌ల యూజర్లు వీలైనంత వరకు వాటిని దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తోంది. అందులో మిలియన్ల కొద్దీ డౌన్‌లోడ్లు కలిగిన ఇక్సిగో ట్రైన్స్‌తో పాటు జీపీఎస్‌ నావిగేషన్‌, ప్రేయర్‌ టైమ్స్‌ వంటి 33 యాప్స్‌ ఉన్నాయి.

ఈ యాప్స్‌ ‘Android.Click.312.origin’ అనే ట్రోజన్‌ మాడ్యూల్‌ ఉండటం వల్ల ఆ యాప్‌లు ప్రమాదకరంగా మారాయని డాక్టర్‌ వెబ్‌ పేర్కొంది. దీని వల్ల ఆ యాప్‌లు మొబైల్‌ఫోన్‌ మోడల్‌, ఓఎస్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌ టైప్, టైమ్‌ జోన్‌ వంటి డేటాను సేకరించి ఆయా సర్వర్లకు పంపిస్తుంటాయి. అయితే, ఈ ట్రోజన్‌ వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి యాప్‌లోనూ ఈ తరహా ట్రాకింగ్‌ వ్యవస్థ ఉంటుందనేది నిపుణుల వాదన. మరోవైపు దాదాపు డాక్టర్‌ వెబ్‌ సూచించిన యాప్స్‌ను ఎప్పటికప్పుడు గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తుంటుంది. ప్రస్తుతం ఇక్సిగో యాప్‌ మాత్రం అందుబాటులో ఉంది. ఒకవేళ కింద పేర్కొన్న ఏదైనా యాప్‌ మీ ఫోన్‌లో ఉండి ఉంటే.. ఓ సారి గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆ పేరుతో సెర్చ్‌ చేయండి. ఒకవేళ గూగుల్‌ వాటిని తొలగించి ఉంటే మీరూ వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చెక్‌ చేయాల్సిన యాప్స్‌ ఇవే..

* GPS Fix
* Webcams
* Bombuj
* Social Studies (a Russian app)
* 1300 Math Formulas Mega Pack
* Sikh World - Nitnem & Live Gurbani Radio
* OK Google Voice Commands (Guide)
* Ramadan Times: Azan, Prayer Times & Qibla
* Prayer Times: Azan, Quran, Qibla Compass
* Al Quran Mp3 - 50 Reciters & Translation Audio
* Full Quran MP3 - 50+ Audio Translation & Languages
Qibla Compass - Prayer Times, Quran, Kalma, Azan
* Muslim Prayer Times & Qibla Compass
* GPS Route Finder
* Ixigo Train
* Who deleted me?

* Who unfriended me?
* Notepad - Text Editor PRO
* Notepad - Text Editor PRO (different APK)
* Power VPN Free VPN for Android
* Video to MP3 Converter, RINGTONE Maker, MP3 Cutter
* Remove Unwanted Object
* GPS Speedometer PRO
* GPS Speedometer
* PDF Viewer
* Route Finder
* Pedometer Step Counter
* EMI Calculator - Loan & Finance Planner
* English Urdu Dictionary
* Cricket Mazza Live Line
* ai.type keyboard Plus + Emoji
* QR Code Reader
* QR & Barcode Scanner

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.