close

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిపై పోలీసు దుశ్చర్య

ధర్నా చేస్తున్న యువతిని గిచ్చి, కాలితో తొక్కిన కానిస్టేబుల్‌ 
వివాదం రేగడంతో చర్యలు తీసుకుంటామన్న ఉన్నతాధికారులు

హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద ఉన్న ఆయుర్వేద కళాశాలను తరలించవద్దంటూ ధర్నా చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు హద్దులు దాటి ప్రవర్తించారు. బుధవారం మధ్యాహ్నం చార్మినార్‌ సమీపంలో ధర్నా చేస్తున్న వారిని విచక్షణారహితంగా లాగిపారేశారు. ఆ సమయంలో ఓ విద్యార్థినితో కానిస్టేబుల్‌ అనుచితంగా ప్రవర్తించాడు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులను చెదరగొట్టి వ్యాన్‌లో ఎక్కించేందుకు మహిళా కానిస్టేబుళ్లు తీవ్రంగా ప్రయత్నించారు.

ఫలితం లేకపోవడంతో అక్కడే మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్‌ పరమేశ్‌ ఒక విద్యార్థినిని కాలుతో తొక్కి.. గట్టిగా గిచ్చాడు. బాధతో విలవిలలాడుతూ ఆ విద్యార్థిని ఏడ్చింది. వెంటనే మహిళా కానిస్టేబుళ్లు ఆమెను అక్కడి నుంచి తరలించారు. కానిస్టేబుల్‌ విద్యార్థినిని గిచ్చుతున్నప్పుడు అక్కడున్న విద్యార్థులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తక్షణం ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ ఘటనపై దక్షిణ మండలం డీసీపీ అంబర్‌ కిషోర్‌ ఝా స్పందించారు. వీడియోను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని విలేకరులకు తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను చిత్రీకరించారని, మహిళలు, యువతులంటే పోలీసులకు ఎంతో గౌరవం ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీ భద్రత సందర్భంగా పోలీసులు కొన్ని సందర్భాల్లో ఇలా ప్రవర్తించే అవకాశాలుంటాయని, వాస్తవాలు తెలుసుకున్నాక చట్టపరమైన చర్యలు చేపడతామని వివరించారు. ఓ ఉన్నతాధికారి సైతంవిద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలొచ్చాయి.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.