దివ్యాంగులకు దివ్యమైన వాహనం
close

తాజా వార్తలు

Updated : 26/07/2019 00:41 IST

దివ్యాంగులకు దివ్యమైన వాహనం

సమాచారం

దివ్యాంగులు కార్లలో ప్రయాణించడం, డ్రైవింగ్‌ చేయడం కష్టతరమైన విషయం. ఇద్దరు సాయం చేస్తేగానీ లోపలికి చేరలేరు. ఎలాగో తిప్పలు పడి లోపలికెళ్లినా కూర్చోవడానికి సీట్లు అనుకూలంగా ఉండవు. ఈ కష్టాలన్నింటికీ చెక్‌ పెట్టేలా వీల్‌ఛైర్‌ సహా నేరుగా లోపలికి వెళ్లేలా కార్లని డిజైన్‌ చేస్తున్నారు వైజాగ్‌ కుర్రాళ్లు బొలెం అనిల్‌కుమార్‌, పి.దినేష్‌ పవన్‌లు.

పని చేస్తుందిలా: కారు వెనక డోరు (డిక్కీ) వైపు ఒక ర్యాంప్‌లాంటిది బిగించారు. ఎవరైనా లోపలికి రావాలనుకున్నప్పుడు నేలకు తగిలేలా దీన్ని కిందికి దించుతారు. వీల్‌ఛైర్‌ దానిపైకి రాగానే లిఫ్ట్‌లా లోపలికి తీసుకెళ్లే టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీనికోసం కారు వెనక వరుసలోని ఒక సీటుని తొలగించారు. కారులో ప్రయాణికుడిలా ఉండాలనుకునేవారికి ఈ ఏర్పాటు. దివ్యాంగులైనా కారు నడిపే సామర్థ్యం ఉన్నవారికి ముందు సైడ్‌ డోర్‌ నుంచి లోపలికి వచ్చేలా ర్యాంప్‌ బిగించారు. మారుతిసుజుకీ ఎర్టిగా, రెనాల్ట్‌ లాడ్జీలాంటి పెద్ద కార్లతోపాటు మారుతిసుజుకీ వ్యాగన్‌-ఆర్‌లాంటి చిన్న కార్లనూ ఇలా మాడిఫై చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఈ వాహనాలెంతో ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు అనిల్‌, దినేష్‌లు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని