సెల్ఫ్‌స్టార్ట్‌తో చెర్‌ర్‌ర్‌మనే శబ్దం
close

తాజా వార్తలు

Updated : 26/07/2019 00:44 IST

సెల్ఫ్‌స్టార్ట్‌తో చెర్‌ర్‌ర్‌మనే శబ్దం

మెకానిక్‌ గురూ

* మూడునెలల కిందట పాత యమహా ఎఫ్‌జెడ్‌ తీసుకున్నాను. గేర్‌ వేసినప్పుడు, గేర్‌ డౌన్‌ చేసినప్పుడు బండి పికప్‌ పడిపోతోంది. కొద్దిదూరం వెళ్తేగానీ మళ్లీ అందుకోవడం లేదు. సెల్ఫ్‌ స్టార్ట్‌ చేస్తుంటే షార్ట్‌సర్క్యూట్‌ అయినప్పుడు వచ్చే శబ్దంలా చెర్‌ర్‌ర్‌మని చప్పుడు వస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపించగలరు.

- శ్రావణ్‌కుమార్‌

 

క్లచ్‌, చైన్‌డ్రైవ్‌ ద్వారా బండి పవర్‌ ఇంజిన్‌ నుంచి గేర్‌బాక్స్‌కి వెళ్తుంది. గేర్లు మార్చుతున్నప్పుడు పవర్‌ డ్రాప్‌ అవుతోందంటే దానర్థం క్లచ్‌ ప్లేట్లు ఒకదానిపై ఒకటి ఎక్కి ఒరుసుకుపోతున్నాయని. ఓసారి క్లచ్‌ ప్లేట్లు పరిశీలించండి. అవి స్థానభ్రంశం చెందితే సరి చేయాలి. వాటిలో పగుళ్లుంటే కొత్తవి వేయించాలి. సెల్ఫ్‌ స్టార్ట్‌ విషయానికొస్తే ముందు వైరింగ్‌ మొత్తం చెక్‌ చేయించండి. సెకండ్‌హ్యాండ్‌ బండి కావడంతో బహుశా వైర్లపై ఉండే ఇన్సులేషన్‌ చెడిపోయిందేమో! దీంతో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదముంది.

- హర్షిన్‌ లాల్‌పేట్‌, ఆటోమొబైల్‌ నిపుణుడు (మీకూ ఇలాంటి సందేహాలు, సమస్యలుంటే రాసి పంపండి. నిపుణులతో పరిష్కారం ఇప్పిస్తాం)

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని