close

తాజా వార్తలు

గోళ్లు ఊడబీకి.. అత్యాచారం చేసి..

రాజస్థాన్‌లో పోలీసుల అకృత్యం

జైపుర్‌:  దొంగతనం కేసులో ఒక వ్యక్తిని పట్టుకెళ్లిన పోలీసులు ఆ తర్వాత అతడి వదినను కూడా తీసుకెళ్లి ఆమెను నానా చిత్రహింసలకు గురిచేశారు. గోళ్లు ఊడబీకారు. రెప్ప తెరవలేనంతగా, కళ్లు తీవ్రంగా దెబ్బతినేలా కొట్టారు. చివరకు నిస్సహాయురాలైన ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఈ నెల 6న జరిగింది. నేమిచంద్‌(22) అనే వ్యక్తిని దొంగతనం ఆరోపణలతో పోలీసులు జూన్‌ 30న అరెస్టు చేశారు. ఈ నెల ఆరోతేదీన అతడిని ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇంటిపట్టునే ఉన్న అతని వదినను కూడా అదుపులోకి తీసుకున్నారు. నేమిచంద్‌ పోలీసుల దెబ్బలకు తీవ్ర గాయాలై వారి కస్టడీలోనే మృతి చెందాడు. ఆ హత్యను కళ్లారా చూసినందుకే తనపై పోలీసులు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆరుగురు పోలీసులపై ఆదివారం కేసు నమోదైంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.