close

తాజా వార్తలు

బుజ్జాయిల యోగా!

కొంతమంది పిల్లలు చదివింది మర్చిపోతుంటారు...
ఇంకొందరు చిన్నారులకు దేనిపైనా ఏకాగ్రత ఉండదు...
మరికొంతమందేమో ఉండాల్సినంత ఎత్తు ఉండరు...
అలాంటి బుజ్జాయిల కోసం కొన్ని యోగాసనాలున్నాయ్‌...
అవేంటో? ఎలా చేయాలో?తెలుసుకుందామా?
ఇంతకీ ఈరోజే ఎందుకంటారా? ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం మరి!

ఎత్తు పెరగడానికి తాడాసనం

* ఎలా చేయాలి?
ముందుగా... రెండు కాళ్లు దగ్గరపెట్టి శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ కాలి వేళ్ల మీద నిలబడాలి. చేతి వేళ్లను బంధించి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి పెట్టాలి. శ్వాసను బయటకి వదులుతూ చేతులు తల మీద పెట్టాలి. ఇలా 10 నుంచి 20 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* లాభాలేంటో?
* ఈ ఆసనం ముఖ్యంగా పిల్లలు ఎత్తు పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది.
* నీళ్లు తాగి ఈ ఆసనం చేయటం వల్ల మలబద్ధకం తగ్గిపోతుంది.

జ్ఞాపకశక్తికి ఉత్తిత పద్మాసనం!

* ఎలా చేయాలి?
ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చేతుల మీద బలంతో శరీరాన్ని నిదానంగా పైకి ఎత్తాలి. శ్వాస మీద దృష్టి పెట్టాలి. నేర్చుకునే దశలో 10 సెకన్లు, 20 సెకన్ల వరకూ ఉంటే చాలు.

* లాభాలేంటో?
* దీని వల్ల ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* ఆకలి బాగా అవుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ శక్తి బాగుంటుంది. గ్యాసు, ఎసిడిటీ సమస్యలు ఎదురుకావు. భుజాలు, చేతులు దృఢంగా మారతాయి.

ఏకాగ్రతకు వృక్షాసనం!

* ఎలా చేయాలి?
ముందుగా రెండు కాళ్లూ దగ్గర పెట్టి నిలబడాలి. కుడి కాలి పాదాన్ని ఎడమకాలి తొడపైన పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి పెట్టి నమస్కారం పెట్టాలి. ఇదంతా శ్వాసను గమనిస్తూ చేయాలి. ఎదురుగా ఉన్నదాన్ని చూస్తూ నిలబడాలి.

* లాభాలేంటో?
* వృక్షాసనం వేయడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది.
* తొడల దగ్గర కండరాలు బలపడతాయి. పిల్లలు ఎత్తూ పెరుగుతారు.

చురుకుదనానికి చక్రాసనం!

* ఎలా చేయాలి?
వెల్లికిలా పడుకుని మోకాళ్లను మడచి మడమలను తొడల దగ్గర పెట్టాలి. రెండు చేతులను వెనక్కి పెట్టి అరచేతులని భుజాలకి దగ్గరగా భూమికి ఆనించాలి. శ్వాస లోపలికి తీసుకుంటూ నడుము, ఛాతిని పూర్తిగా పైకి ఎత్తాలి.శరీరం మొత్తాన్ని అరికాళ్ల అరిచేతుల మీద పూర్తిగా పైకి ఎత్తాలి. శరీరాన్ని చక్రంలాగా ఉంచాలి. మొదట్లో 10 సెకన్లు చేయొచ్చు. నెమ్మదిగా ఆ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.

* లాభాలేంటో?
* ఈ ఆసనం చేయడం ద్వారా శరీరంలో ప్రతి ఒక్క కండరం, నరాలు చురుగ్గా అవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం అందంగా ఉంటుంది.
* ఇంకా చిన్నారుల ఎదుగుదల, ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుంది.

-కృష్ణశ్రీ, యోగా నిపుణురాలు

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.