close

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు ఏడీబీ నుంచి అప్పు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు తోచిన చోటల్లా అప్పులు చేస్తోంది. తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ వద్ద నుంచి 3.4 బిలియన్‌ డాలర్ల మేరకు అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆర్థిక సలహాదారు వెల్లడించారు. చెల్లింపుల సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 
ఏడాదిలోపు 2.2బిలియన్‌ డాలర్లు విడుదలయ్యేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. అతితక్కువ వడ్డీకే ఈ రుణం మంజూరైందని పాక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.ప్రధాని సలహాదారు అబ్దుల్‌ హఫీజ్‌ షేక్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి త్రైమాసికంలో 2.2 బిలియన్‌ డాలర్లను విడుదల చేస్తారు. ఇది దేశ  అప్పులను చెల్లించేందుకు ఉపయోగపడుతుంది.’’ అని పేర్కొన్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.