
తాజా వార్తలు
ఆఫీస్ నుంచి వచ్చిన ఆయనగారు.. ఆటలాడి ఇంటికొచ్చిన పిల్లలు.. అందరూ ఆకలితో నకనకలాడుతున్న వేళ.. వేడివేడిగా ఏదైనా అందిస్తే.. ‘శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన..’ ‘అమ్మను మించి దైవమున్నదా.. ’ పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించకుండా ఉంటాయా? ఇదెలా సాధ్యమవుతుందనేగా! కొలువు నుంచి వారి కన్నా ఓ పది నిమిషాల ముందు ఇంటికి చేరుకుంటే సరి! ఇంటి పట్టునే ఉండే వారైతే.. ఎప్పుడో సాయంత్రం స్నాక్స్ కోసం మధ్యాహ్నం నుంచి ఆలోచించాల్సిన పనిలేదు. కరకరలాడే పకోడీ.. రుచికరమైన దోసెలు.. ఇలా రకరకాలు క్షణాల్లో పూర్తి చేసి.. విలక్షణ రుచులను పంచొచ్చు. మీ దక్షతను చాటుకోవచ్చు.
నిమిషాల్లో మ్యాగీ పకోడీ తయారీ: మ్యాగీ పూర్తిగా ఉడికిపోకుండా గట్టిగా ఉండగానే దింపుకోవాలి. అందులో మిగిలిన నీళ్లని వంపేసి.. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా, బటర్, కొద్దిగా మ్యాగీ మసాలా, బియ్యప్పిండి, సెనగపిండి వేసి నీళ్లు కలపకుండా ఉన్న నీటితోనే ముద్దలా కలుపుకోవాలి. వీటిని ఉండల్లా చేసుకుని మైదాలో దొర్లించి నూనెలో వేయించుకుంటే మ్యాగీ పకోడీ సిద్ధం. |
ఇన్స్టెంట్ దోసెల కోసం కలిపిన పిండిలో చిటికెడు మిర్యాల పొడి వేసుకుంటే దోసెలు రుచిగా ఉంటాయి. |
ఉల్లిపాయ పకోడి, మ్యాగీ పకోడి, బ్రెడ్ పకోడి... ఇలా పకోడీలను వేటితో వేసినా ఆ పిండిలో చిటికెడు వంట సోడా కలిపితే అవి మెత్తగా వస్తాయి. |
ఫటాఫట్ మీఠాచావల్ తయారీ: కుక్కర్లో నెయ్యి వేడి చేసుకుని అందులో జీడిపప్పు, బాదం పప్పులు, దాల్చినచెక్క, బియ్యం కూడా వేసి దోరగా వేయించుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసి చిటికెడు ఫుడ్‌కలర్ కూడా కలిపి రెండు విజిల్స్ రానివ్వాలి. తర్వాత పంచదార వేసి మరో నాలుగు నిమిషాలు తక్కువ మంట మీద ఉంచి యాలకులు వేసి వండితే మీఠాచావల్ సిద్ధం. పిల్లలు ఇష్టంగా తింటారు. |
ధనాధన్ పనీర్పకోడీ తయారీ: పనీర్‌ని తగిన పరిమాణంలో కట్‌చేసి చాట్మసాలాలో దొర్లించుకోవాలి. ఇప్పుడు సెనగపిండిలో కారం, ఉప్పు, ధనియాలపొడి, కొద్దిగా నీళ్లు కలిపి పకోడీపిండిలా కలుపుకోవాలి. ఇందులో పనీర్ ముక్కలని ముంచి పకోడీల్లా వేసుకోవాలి. సాయంత్రం పూట స్నాక్‌గా బాగుంటుంది. |
ఇన్స్టెంట్ దోసె తయారీ: ఒక పాత్రలో బొంబాయిరవ్వ, బియ్యప్పిండి, మైదా, పెరుగు, ఉప్పు రెండున్నర కప్పుల నీళ్లు పోసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు కలిపి జారుగా తయారుచేసుకోవాలి. వెంటనే లేదా ఓ పదినిమిషాలాగి దోసెలు వేసుకుంటే కరకరలాడే రుచికరమైన ఇన్స్టెంట్ దోసెలు సిద్ధం. |
క్షణాల్లో చాక్లెట్ కేక్ తయారీ: ఒక పాత్రలో మైదా, పంచదార, కొకొవాపౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి అన్నింటిని బాగా కలపాలి. ఇందులో కరిగించిన బటర్, పాలు, గుడ్డు సొన, వెనిల్లా వేసి ఉండల్లేకుండా కలపాలి. ఒక మగ్‌లో ఈ మిశ్రమాన్ని పోసి ఆపై చాక్లెట్ చిప్స్ వేయాలి. పైన ఒక చెంచా నీళ్లుపోసి దీనిని రెండు నుంచి మూడు నిమిషాలపాటు అవెన్‌లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ కెలొరీల్లో ఎక్కువ సంతృప్తినిచ్చే వంటకం ఇది. |
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన చిరు
- ‘ఏరా నీకంత పొగరా.. వేషం లేదు పో’ అన్నారు!
- నాటి చేతక్.. నేటి పల్సర్.. ఈయన కృషే..!
- మాజీ ప్రియురాలితో షూటింగ్‌కి నో..
- ఐరాస మెచ్చినఅందాల అమ్మ
- ఏదో ఒక రోజు బాలీవుడ్ సినిమాలో చూస్తారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
