close

తాజా వార్తలు

సీబీఎస్‌ఈలో మూడు కొత్త సబ్జెక్టులు

న్యూదిల్లీ: సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్లో కృత్రిమ మేథ, యోగా, బాల్య సంరక్షణ విద్య కూడా భాగం కానున్నాయి. ఈ మూడు సబ్జెక్టులను సీబీఎస్‌ఈలో కొత్తగా చేర్చనున్నట్లు అధికారులు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా మారాలని అందుకే ఈ సబ్జెక్టులను ప్రవేశపెడుతున్నట్లు వారు చెప్పారు. తాజాగా జరిగిన సీబీఎస్‌ఈ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2019-20 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతిలో ఆప్షనల్‌ సబ్జెక్టుగా కృత్రిమ మేథను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలంతా యోగాకి ఆకర్షితులౌతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నిపుణుల కొరతను తీర్చేందుకు, బాల్య సంరక్షణ విద్యా నిపుణులను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇవన్నీ ఆప్షనల్‌ సబ్జెక్టులుగానే ఉంటాయని చెప్పారు.

సీబీఎస్‌ఈలో ఉన్న నిబంధనల ప్రకారం విద్యార్థి ఐదు సబ్జెక్టులను తప్పనిసరిగా చదవవలసి ఉంటుంది. 6వ సబ్జెక్టుగా విద్యార్థి నైపుణ్యాన్ని తీర్చిదిద్దే ఏ సబ్జెక్టునైనా ఎంచుకోవచ్చు. అందుకోసం 42 సబ్జెక్టులను సీబీఎస్‌ఈ అందుబాటులో ఉంచింది. మిగిలిన వాటిలాగే ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. ఏదేని ఒక నిర్ణీత సబ్జెక్టులో విద్యార్థి ఫెయిల్‌ అయితే, ఆ సబ్జెక్టు స్థానంలో ఆప్షనల్‌ను పెట్టుకోవచ్చు. సీబీసీఈ 10వ తరగతిలో కూడా మార్కులు మెరుగ్గా వచ్చిన ఐదు సబ్జెక్టుల ఆధారంగానే మార్కులు వేస్తారు. నిజానికి విద్యార్థులు రెండు ఆప్షనల్‌ సబ్జెక్టులను కూడా ఎంచుకోవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.