close

తాజా వార్తలు

చెత్త కొత్తగా!
చెత్తే కదా అని తీసి పారేస్తాం... కానీ యువత కాస్త కొత్తగా ఆలోచిస్తే నయా రూపాలవుతాయి... ట్రెండీ ట్రెండీ దుస్తులవుతాయి... హుషారెత్తించే గిటారులవుతాయి! కావాల్సింది కొంచెం ఆలోచన, ఇంకొంచెం సృజనాత్మకత అంతే.

* చక్కని చెక్కతో తయారయిన టేబుల్‌ కాదు ఇది. ఇంట్లో పక్కన పెట్టిన హాకీ కర్రలతోనే ఈ కాఫీ టేబులయ్యింది. విరిగిన, పనికిరాని హాకీ కర్రల చెక్కను ఉపయోగించి రూపొందించారు.

* షూలు సాధారణంగా జీన్స్‌ క్లాత్‌తోనో లెదర్‌తోనో తయారవుతాయి. కానీ ఇక్కడున్న షూలు మాత్రం పాడైన మామిడి పండ్ల గుజ్జు నుంచి తయారయ్యాయి.

* ఈ గిటార్‌ ఎలా తయారయ్యిందో తెలుసా? పాత స్కేట్‌ బోర్డ్స్‌ నుంచి!

* వాటర్‌ బాటిళ్లు నీళ్లు తాగి పడేస్తాం. కానీ ఇక్కడున్న ఈ స్పోర్ట్స్‌ దుస్తులు తయారైంది వాటితోనే మరి!

ఇలా వృథాతో తయారైన వస్తువుల వైపు యువత ఎక్కువగా మొగ్గు  చూపడంతో ఇవి మార్కెట్లో ట్రెండ్‌ అవుతున్నాయి. ట్రేడ్‌ అవుతున్నాయి.

సహకారం: సోనీ - బీబీసీ ఎర్త్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.