close

తాజా వార్తలు

Updated : 31/12/2018 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీ ప్రేమ కోసం  మళ్లీ పుడతా

నీ ప్రేమ కోసం  మళ్లీ పుడతా

2016, అక్టోబరు 22... ఆ రోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైంది.. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు నాకెంతో ఇష్టమైన చదువుకు నన్ను దూరం చేశాయి.. అనూహ్యంగా వేరే ఊరిలో ఓ హోటల్‌లో పనిచేయాల్సి వచ్చింది. అలా చేస్తూ ఉండగానే నా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. కొద్ది రోజులు సెలవు తీసుకొని ఇంటికి పయనమయ్యాను. ఆరోజు సాయంత్రం బస్‌స్టాండ్‌కి చేరుకున్న నాకు ఓ అమ్మాయి రెండు చేతులు జోడించి నమస్కరించింది. బావున్నారా అభిగారు అని పలకరించింది. తను నాకు మూడేళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తే కానీ ఆరోజు ఎందుకో కొత్తగా కనిపించింది.

నీ ప్రేమ కోసం  మళ్లీ పుడతా

అప్పటికే తన గురించి ఇంట్లో వాళ్లు, నా మిత్రులు గొప్పగా మాట్లాడుకోవడం విన్నాను. లేత గులాబీ రంగులో నిండుగా కప్పేసిన చుడీదార్‌తో అప్పుడే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతలా తనుంది. చూడగానే ఏదో కొత్త అనుభూతి. మా మాటలు కలిశాయి. అరవై నిమిషాల ఆ బస్సు ప్రయాణం 6 నిమిషాల్లో ముగిసినట్లే అనిపించింది. ఆమె మాటలతో ఏదో తెలియని మంత్రం వేసి నా మదిని తన చుట్టూరా తిప్పుకోవడం మొదలెట్టింది. అప్పుడే ఓ చిన్న ఆశ.. అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందని..! నా మనసులో కలిగిన భావనను అమ్మకి చెప్పేశా. అమ్మ మంచి ఆలోచన నాన్నా.. అని ప్రోత్సహించడంతో ఇక ఆ పనిలో పడిపోయా. తెల్లవారితే తనని మళ్లీ చూడాలన్న ఆత్రుత.. తనతో నా మనసులోని మాట చెప్పాలన్న కోరిక. ఉదయాన్నే కాలేజీకి వెళ్లగానే తనని చూసి నేరుగా తన దగ్గరికి వెళ్లి లోపల ఒకింత భయంతో మనసులో మాట చెప్పేశాను. ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అన్నాను. ఇంతలో ఊహించని సమాధానం తన నుంచి. అది నేను మిమ్మల్ని అడగాలి అని.. అదేంటి అలా అన్నావంటే ‘మీరంటే నాకూ ఇష్టమ’ని చెప్పేసింది. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. మా ప్రేమలో రెండేళ్లు ఇట్టే కరిగిపోయాయి. ఇంతలో నాకు ఉద్యోగం వచ్చింది. ఇక పెళ్లికి ముహూర్తం తరువాయి అనుకున్న సమయంలో ఇన్నాళ్ల ఆనందం, నా కలలు ఒక్కసారిగా చిన్నాభిన్నం అయిపోయాయి. నాకేదో వ్యాధి ఉందని చెప్పిన డాక్టరు మాటలు నన్ను పాతాళంలోకి నెట్టేశాయి. నా జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఇక నేను ఉండననే ఆలోచనే నన్ను చంపేస్తుంది. ఈ విషయం తనతో చెప్పలేక తనని దూరం పెట్టాను. నువ్వంటే ఇష్టం లేదన్నాను. ఆ మాట చెప్పేటప్పుడు నా గుండె ఎంత ఏడ్చిందో కన్నీళ్లకే తెలుసు. ఇప్పుడు తనకి దూరంగా బతుకుతున్నాను. అవును నేను తనని మోసం చేశాను. సంతోషంగా సాగుతున్న తన జీవితంలో అడగకుండానే అడుగుపెట్టి, చెప్పకుండానే వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించు చిన్ని. ఇలా అవుతుందంటే అసలు ప్రేమించే వాన్నే కాదు.. నన్ను క్షమించు. నన్ను మా అమ్మలా ప్రేమించావు.. మళ్లీ జన్మంటూ ఉంటే నీ గొప్ప ప్రేమ పొందడానికి నీకు కొడుకుగా పుడతా..!

- నీ అభి

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని