close

తాజావార్తలు

నోట్ల వర్షం కురిసింది..

అట్లాంటా: ఇప్పటికిప్పుడు డబ్బులవాన కురిస్తే ఎంత బాగుండు..బాగా డబ్బు అవసరం ఉన్నప్పుడు మనం ఆశగా అనుకునే మాట ఇది. నిజంగా డబ్బులవాన ఎక్కడైనా కురుస్తుందా..? కురుస్తుంది..కురుస్తుంది..ఎందుకు కురవదు అట్లాంటాలో జరిగిన ఈ సంఘటన చూస్తే అలాగే అనుకుంటారు. బుధవారం రాత్రి అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో ఒక ఆర్మీ ట్రక్‌ సూమారు కోటీ పదిలక్షల రూపాయలను(1.75 లక్షల డాలర్లు) తీసుకెళుతోంది. ఆ సందర్భంలో ఒక్కసారిగా ఆ వాహన తలుపు తెరుచుకోవడంతో ఆ డబ్బంతా బయటకు వచ్చేసింది. అదే సమయంలో బాగా గాలి వీచడంతో ఆ దృశ్యం డబ్బులవానలా మారింది. ఆ మార్గం గుండా పోయే వాహనదారులు దిగి ఆ డబ్బు ఏరుకున్నారు. చరవాణులతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలు ఇపుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. ‘నగదుతో కూడిన ఆర్మీ వాహనం తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవడంతో ఈ సంఘటన జరిగింది. అధికారులు, సిబ్బంది కొంత మొత్తంలో పడిపోయిన నగదును సేకరించారు.అయితే భారీ మొత్తంలో నగదును చాలామంది ఎత్తుకుపోయారు’ అని తెలిపారు. దీనిపై నెటిజన్లు ట్విట్టర్‌లో జోక్‌లు, మీమ్‌లు పేలుస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.