close

తాజా వార్తలు

Published : 21/09/2020 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రంప్‌పై విషప్రయోగానికి కుట్ర పన్నిన మహిళ అరెస్ట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విష ప్రయోగం జరిపేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్‌-కెనడా సరిహద్దుల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రంప్‌నకు చేరేలా శ్వేతసౌధం చిరునామాతో వచ్చిన పార్శిల్‌ కెనడా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా జరిపిన విచారణలో ఓ మహిళే నిందితురాలని తేలినట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. 

‘రైసిన్‌’ అనే విషం ఉన్న ఓ పార్శిల్‌ను అధ్యక్ష భవనానికి చేరకముందే పోలీసులు పరీక్షించి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ పార్శిల్‌ను ఎవరు పంపించారో గుర్తించేందుకుగానూ ఎఫ్‌బీఐ, సీక్రెట్‌ సర్వీస్‌, అమెరికా పోస్టల్‌ తనిఖీ సేవల విభాగం దర్యాప్తు చేశాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.