పార్లమెంట్‌ ఎదుట బైఠాయిస్తాం: టికాయత్

తాజా వార్తలు

Published : 13/07/2021 21:54 IST

పార్లమెంట్‌ ఎదుట బైఠాయిస్తాం: టికాయత్

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 22న పార్లమెంట్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపడతామన్నారు. వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో గత 8 నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ వ్యూహం మార్చినట్లు టికాయత్‌ వెల్లడించారు.

ఇకపై రైతులంతా కాకుండా ఒక్కో గ్రామం నుంచి 10 మంది రైతులు 15 రోజులపాటు ఆందోళన నిర్వహించాలని, ఈ విధానం నిరంతరాయంగా కొనసాగాలని నిర్ణయించారు. వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్టాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పశ్చిమప్రాంత రైతులు ఈ వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, తమ పంటలకు కనీసమద్దతు ధర హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్రానికి, రైతులకు మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ  సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో వ్యవసాయ చట్టాల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని