‘రణ’తంత్రం స్క్రిప్ట్‌ వారిదే: ఆప్‌

తాజా వార్తలు

Published : 31/01/2021 01:35 IST

‘రణ’తంత్రం స్క్రిప్ట్‌ వారిదే: ఆప్‌

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక భాజపా హస్తముందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జనవరి 26 నాటి ఘటనలకు ఆ పార్టీనే స్క్రిప్ట్‌ రచించిందని, శాంతియుతంగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి అపకీర్తి తెచ్చేందుకు దిల్లీ పోలీసులతో కలిసి ఈ కుట్ర పన్నిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు.

జనవరి 26 నాటి ఘటనలకు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలకు దిల్లీ పోలీసుల సహకారంతో భాజపానే స్క్రిప్ట్‌ రూపొందించిందని భరద్వాజ్‌ అన్నారు. భాజపా ఏజెంట్‌ అయిన దీప్‌సిద్ధూ ఎర్రకోటకు చేరుకునేందుకు దిల్లీ పోలీసులు అనుమతించారని ఆరోపించారు. అలాగే సింఘు, టిక్రి సరిహద్దుల్లో స్థానికుల ముసుగులో రైతులపై దాడికి పాల్పడిందీ భాజపా వారేనని అన్నారు. స్థానికులెవరికీ రైతులపై దాడి ఘటనకు సంబంధం లేదన్నారు. ఆప్‌ ఆరోపణలపై భాజపా తక్షణం ఎలాంటి స్పందనా తెలియజేయలేదు.

ఇవీ చదవండి..
ఘాజీపూర్‌ సరిహద్దుకు భారీగా రైతన్నలు
దిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని