వేల్చేరు చొరవ అభినందనీయం: ఉపరాష్ట్రపతి

తాజా వార్తలు

Published : 27/02/2021 09:59 IST

వేల్చేరు చొరవ అభినందనీయం: ఉపరాష్ట్రపతి

న్యూదిల్లీ: తెలుగు కవుల సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖ రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త వేల్చేరు నారాయణరావు చొరవ అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ‘ఆనరరీ ఫెలో ఆఫ్‌ సాహిత్య అకాడమీ’కి వేల్చేరు ఎంపికవడంపై ఉపరాష్ట్రపతి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి వేల్చేరు చేసిన కృషి గొప్పదని పేర్కొన్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోషిప్‌ అన్నది దేశంలో సాహిత్య రంగంలో దక్కే అత్యున్నత గౌరవం. తెలుగు సాహిత్యం, దక్షిణభారత చరిత్ర, అనువాద రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా నారాయణరావును దీనికి ఎంపిక చేశారు. మన దేశ సాహిత్య రంగంలో అరుదైన గౌరవానికి ఎంపికైన 14వ వ్యక్తిగా, తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. లోగడ ప్రముఖ రచయితలు వీఎస్‌ నైపాల్‌, ప్రొఫెసర్‌ డేనియల్‌ హెచ్‌హెచ్‌ ఇంగాల్స్‌ తదితరులు ఈ అత్యున్నత సాహితీ గౌరవాన్ని దక్కించుకున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని