పెద్దల పండుగ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి

తాజా వార్తలు

Published : 14/01/2021 14:29 IST

పెద్దల పండుగ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి

పనాజీ: ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నవ్య కాంతులు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్‌లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసే ఈ సంక్రాంతిని పెద్దల పండుగగా కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ‘‘ సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే ఈ రోజు సానుకూల మార్పునకు ప్రతీక. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లోకి నవ్యకాంతులు తీసుకురావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ఉపరాష్ట్రపతి ట్విటర్‌లో తెలిపారు. ప్రస్తుతం గోవా రాజ్‌భవన్‌లో ఉన్న ఉపరాష్ట్రపతి మకరసంక్రాంతి పర్వదినం సందర్భంగా రాజ్‌భవన్‌లోని విఘ్నేశ్వరాలయానికి కుటుంబసమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

ఇవీ చదవండి..

తమిళనాడులో ఉత్సాహంగా జల్లికట్టు

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోదీ
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని