సైనికుల వల్లే ప్రశాంతంగా నిద్రిస్తున్నాం: రావత్‌ 

తాజా వార్తలు

Published : 15/11/2020 03:13 IST

సైనికుల వల్లే ప్రశాంతంగా నిద్రిస్తున్నాం: రావత్‌ 

డెహ్రాడూన్‌: సరిహద్దుల్లో పరిస్థితులు క్షేమంగా ఉన్నప్పుడే దేశం ప్రశాంతంగా నిద్రపోగలదని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ అన్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని ఆర్మీ, ఐటీబీపీ జవాన్లతో కలిసి శనివారం ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కోపాంగ్‌లోని ఐటీబీపీ శిబిరం, హార్షిల్‌లోని బిహార్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌ సైనికులను కలిసి వారితో సమయం గడిపారు. అక్కడి జవాన్లకు మిఠాయిలు పంచి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావత్‌ మాట్లాడుతూ.. ‘మన సైనిక బలగాలు దేశ సరిహద్దుల్లో ఎంతో కఠినమైన పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం శ్రమిస్తున్నారు. కుటుంబాలకు సైతం దూరంగా ఉండి విధులను నిర్వర్తిస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు విధుల్లో అప్రమత్తంగా ఉన్నందువల్లే దేశం ప్రశాంతంగా నిద్రపోతోంది. మహిళా సైనికాధికారులు సైతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ రక్షణకు వారి సేవలను అందించడం ఎంతో అభినందనీయం. వారు ఎందరికో ఆదర్శం కూడా. నా తండ్రి సైతం దేశ సైన్యంలో పనిచేశారు. ఈ రోజు నేను మీతో పండగను జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని సీఎం రావత్‌ వెల్లడించారు. 

కాగా భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం శనివారం దీపావళి వేడుకలను దేశ సైనికులతో కలిసి జరుపుకొన్న విషయం తెలిసిందే. జైసల్మేర్‌లోని లొంగేవాలా పోస్ట్‌లో జవాన్లను కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు అందజేసి ప్రసంగిస్తూ.. సరిహద్దుల్లో ఘర్షణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలు పాక్‌, చైనాలకు మోదీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని హెచ్చరించారు. 

సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఇవీ చదవండి..

సరిహద్దుల్లో పరీక్షిస్తే.. దీటైన జవాబు తప్పదు: మోదీ

యుద్ధ ట్యాంకర్‌పై మోదీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని